iDreamPost
android-app
ios-app

Thank You Movie : చైతు సినిమా రిలీజ్ క్లారిటీ

  • Published Dec 08, 2021 | 6:32 AM Updated Updated Dec 08, 2021 | 6:32 AM
  • Published Dec 08, 2021 | 6:32 AMUpdated Dec 08, 2021 | 6:32 AM
Thank You Movie : చైతు సినిమా రిలీజ్ క్లారిటీ

బంగార్రాజు కంటే ముందు మొదలై ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంకొద్ది భాగం మాత్రమే బాలన్స్ ఉన్న థాంక్ యు సినిమా గురించి పెద్దగా అప్ డేట్స్ రాకపోవడం అక్కినేని ఫ్యాన్స్ లో ముందు నుంచి ఏదో అనుమానం రేకెత్తించేలానే సాగింది. దానికి తగ్గట్టుగా వచ్చిన ఒక కొత్త ప్రచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాని ప్రకారం ఈ మూవీని డైరెక్ట్ ఓటిటికి ఇవ్వడం గురించి నిర్మాత దిల్ రాజు సీరియస్ గానే ఆలోచిస్తున్నారట. పెట్టిన బడ్జెట్ కు తగ్గట్టుగా ఇప్పుడు థియేట్రికల్ రెవిన్యూలు లేకపోవడంతో ఈ ఆప్షన్ గురించి పలు దఫాలు చర్చలు జరుగుతున్నట్టుగా బయటికి వచ్చింది. కానీ వాటిని ఖండిస్తూ నిర్మాణ సంస్థ నుంచి థియేటర్ రిలీజ్ మాత్రమే అని క్లారిటీ వచ్చేసింది.

ఇటీవలే విడుదలైన అఖండకు వస్తున్న కలెక్షన్లు స్ఫూర్తినిస్తున్నప్పటికీ అవి పాన్ ఇండియా లేదా మాస్ మసాలా కమర్షియల్ స్టార్లకు మాత్రమే అనేలా వ్యవహారం ఉంది. 30 కోట్ల బడ్జెట్ దాటిన ఏ సినిమా అయినా హాళ్ల ద్వారా అంత మొత్తాన్ని రాబట్టుకోవడం సులభం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రావాలంటే బలమైన కారణం కోరుకుంటున్నారు. పైగా ఓమిక్రాన్ వైరస్ గురించి ప్రభుత్వాలు హెచ్చరించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర డ్రీమ్ రన్ సాధించడం ఈజీ కాదు. పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ కి మాత్రమే దేశవ్యాప్తంగా వసూళ్లను ఆశించవచ్చు.థాంక్ యు లాంటివి కంటెంట్ తో ఆకట్టుకోవాలి

థాంక్ యు విషయంలో ఫైనల్ గా స్పష్టత వచ్చేసింది. ఓటిటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం మీద చైతుకి గట్టి అంచనాలే ఉన్నాయి. ఫ్యాన్స్ థియేటర్లోనే చూడాలనుకోవడం సహజం. మరి దానికి తగ్గట్టు మ్యాటర్ ని క్లియర్ చేశారు కాబట్టి టెన్షన్ తీరిపోయింది. కాకపోతే ఎప్పుడు రిలీజనేది మాత్రం ఓపెన్ చేయలేదు. సరైన సమయం అని మాత్రమే అన్నారు. థాంక్ యు దర్శకుడు విక్రమ్ కుమార్ తోనే చైతు ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే

Also Read : Mass Maharaja Ravi Teja : మాస్ మహారాజా తగ్గడం లేదట

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş