iDreamPost
android-app
ios-app

రణ్వీర్ కొత్త ఇల్లు జస్ట్ 120 కోట్లే

  • Published Jul 11, 2022 | 12:37 PM Updated Updated Jul 11, 2022 | 12:37 PM
  • Published Jul 11, 2022 | 12:37 PMUpdated Jul 11, 2022 | 12:37 PM
రణ్వీర్ కొత్త ఇల్లు జస్ట్ 120 కోట్లే

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు తమ స్వంత ఇంటికి పెట్టే ఖర్చు చూస్తే మతులు పోవాల్సిందే. తాజాగా రన్వీర్ సింగ్ ముంబైలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ ని కేవలం 120 కోట్లకు సొంతం చేసుకోవడం ఇప్పుడు ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా బడ్జెట్ తో సమానం లేదా అంతకంటే ఎక్కువే అనొచ్చు.

అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ఉండే అపార్ట్ మెంట్ లో 16 నుంచి 19 ఫ్లోర్ల దాకా విస్తరించి ఉన్న క్వాడ్రుప్లెక్స్ (నాలుగు అంతస్తులు)ని రన్వీర్ కొనేసుకున్నాడు. కేవలం స్టాంప్ డ్యూటీకే 7 కోట్ల 13 లక్షలు రిజిస్టర్ ఆఫీస్ లో చెల్లించాల్సి వచ్చిందట. ఇది మొత్తం 11 వేల 266 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. మొత్తం 19 పార్కింగ్ స్లాట్స్ తనకు కేటాయించారు. తన ఇరుగు పొరుగు సల్మాన్, షారుఖ్ అంటేనే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రీమియం ఏరియానో.

భార్య దీపికా పదుకునేతో పాటు రన్వీర్ ఇందులో కాపురం ఉండబోతున్నాడు. ఇప్పటికే ఇద్దరికీ వేర్వేరుగా కలిసికట్టుగా స్వంత ఇళ్లు ఉన్నప్పటికీ దీన్ని తమ డ్రీం డెస్టినేషన్ గా ప్లాన్ చేసుకున్నారట. ఇందులో చాలా విశేషాలే ఉన్నాయట. రన్వీర్ సింగ్ ప్రస్తుతం సర్కస్ పూర్తి చేసి రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని షూటింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ శంకర్ తో స్టార్ట్ అవుతుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş