iDreamPost
android-app
ios-app

RGV ‘వ్యూహం’ మూవీకి తొలగిన అడ్డంకులు! సెన్సార్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

  • Published Dec 13, 2023 | 9:30 PM Updated Updated Dec 13, 2023 | 9:30 PM

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' మూవీ సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ.. సెటైరికల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' మూవీ సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ.. సెటైరికల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Dec 13, 2023 | 9:30 PMUpdated Dec 13, 2023 | 9:30 PM
RGV ‘వ్యూహం’ మూవీకి తొలగిన అడ్డంకులు! సెన్సార్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?

రామ్ గోపాల్ వర్మ.. మూవీ ఇండస్ట్రీలో ఈ పేరు ఓ సంచలనం అన్న విషయం మనందరికి తెలిసిందే. నిజాన్ని నిక్కచ్చిగా, ముక్కుసూటిగా చెప్పి పాపం విమర్శల పాలవుతుంటాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఈ సెన్సేషనల్ డైరెక్టర్ లేటెస్ట్ గా తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. ఇక ఈ మూవీని రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికి చాలా మంది విశ్వప్రయత్నాలు చేశారని, వారందరి ప్రయత్నాలు విఫలయత్నాలు అయ్యాయని కామెంట్ చేశాడు ఆర్జీవీ. తాజాగా వ్యూహం మూవీ సెన్సార్ పూర్తి చేసుకుందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరి ఈ మూవీకి సర్టిఫికెట్ ఏమెచ్చింది? రిలీజ్ డేట్ ఎప్పుడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ మూవీ రిలీజ్ చేయకుండా చూడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయంపై ఘాటుగానే స్పందించాడు వర్మ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అలాగే మా వ్యూహాన్ని ఆపలేరు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. వ్యూహాం మూవీకి అన్ని అడ్డంకులు తొలిగాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ సాధించింది. ఈ విషయాన్ని తనదైన శైలిలో ప్రకటించారు. “బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్” అంటూ వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను పోస్ట్ చేశాడు. అదే విధంగా డిసెంబర్ 29న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తెలియపరిచాడు. మరి వర్మ సెటైరికల్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom