iDreamPost
android-app
ios-app

పసూరి సాంగ్‌కి రకుల్ డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో..

  • Published Jun 25, 2022 | 8:32 PM Updated Updated Jun 25, 2022 | 8:32 PM
  • Published Jun 25, 2022 | 8:32 PMUpdated Jun 25, 2022 | 8:32 PM
పసూరి సాంగ్‌కి రకుల్ డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో..

తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యాపిల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేసి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది రకుల్. ఇటీవలే ‘రన్‌ వే 24’, ‘ఎటాక్‌’ చిత్రాలతో బాలీవుడ్ లో పలకరించింది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో దాదాపు అరడజనుకి పైగా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.

ఇక రకుల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగానే చెప్పేసింది. తాజాగా రకుల్ పసూరి అనే ఓ ప్రైవేట్ సాంగ్ కి డ్యాన్స్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది. బాలీవుడ్ సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్‌ వద్ద డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న రకుల్ ‘పసూరి’ పాటకు స్టెప్పులేసి ఆ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసి ప్రస్తుతం నా ఫేవరేట్ సాంగ్ అని పోస్ట్ చేసింది.

రకుల్ అద్భుతమైన డ్యాన్స్ చూసి అభిమానులు, నెటిజన్ల తో పాటు అదిరిపోయింది అంటూ సెలబ్రిటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో రకుల్ చాలా అందంగా ఉంది. తన అందాలని ప్రదర్శిస్తూ చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. సూపర్, హాట్, అదిరిపోయింది అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రియుడు డ్యాన్స్ నాకు కూడా నేర్పించు అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం రకుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet