iDreamPost
android-app
ios-app

వీడియో: 10వ తరగతి విద్యార్థికి గుండెపోటు! చూస్తుండగానే ప్రాణాలు పోయాయి!

  • Published Jul 08, 2024 | 1:42 PM Updated Updated Jul 08, 2024 | 1:42 PM

Rajasthan Student: ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. అప్పటి మనతో ఎంతో హ్యాపీగా గడిపిన వారు, ఆరోగ్యంగా కనిపించిన వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురైతున్నారు.

Rajasthan Student: ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. అప్పటి మనతో ఎంతో హ్యాపీగా గడిపిన వారు, ఆరోగ్యంగా కనిపించిన వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కి గురైతున్నారు.

  • Published Jul 08, 2024 | 1:42 PMUpdated Jul 08, 2024 | 1:42 PM
వీడియో: 10వ తరగతి విద్యార్థికి గుండెపోటు! చూస్తుండగానే ప్రాణాలు పోయాయి!

ఇటీవల దేశంలో గుండెపోటు మరణాల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడం.. ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సడెన్ గా హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు ఎక్కువగా యువతలో కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి, డిప్రేషన్ కి గురి కావడం, అనారోగ్య సమస్యలు, ఎక్కువగా వ్యాయామం చేయడం, డ్యాన్స్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు వైద్యులు. తాజాగా ఓ పదవ తరగతి విద్యార్థి చూస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్.. దౌసాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న యతేంద్ర ఉపాధ్యాయ్‌ (16) గుండెపోటుకి గురై అక్కడే కుప్పకూలిపోయి కన్నుమూశాడు. చనిపోవడానికి ముందు రోజే పుట్టిన రోజు చేసుకోవడం అందరి హృదయాలను కలచి వేస్తుంది. కొంత కాలంగా ఆ విద్యార్థి గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండికుయ్ పట్టణంలోని ఓ పాఠశాలకు వెళ్లిన టెన్త్ క్లాస్ విద్యార్థి తరగతి గది ముందు కుప్పకూలిపోయాడు.. ఆ విద్యార్థి లేవలేకపోవడంతో సిబ్బంది అతని వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేశారు. కానీ ఆ విద్యార్థి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ విద్యార్థి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పవన్ జర్వాల్ అనే డాక్టర్ మాట్లాడుతూ..‘యతేంద్ర అనే విద్యార్థిని స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తీసుకువచ్చారు. మేం సీపీఆర్ చేశాము.. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ విద్యార్థి కన్నుమూశాడు.. మేం ఏం చేయలేకపోయాం’ ఈ మధ్య చిన్న వయసు వాళ్లకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది.. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాని అన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యతేంద్ర ఉపాధ్యాయ్‌ కి మూడు సంవత్సరాల క్రితం గుండె సంబంధిత సమస్య ఉందని.. ఇలా హఠాత్తుగా కన్నుమూస్తాడని ఊహించలేకపోయామని కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోలీసులు సదరు విద్యార్థి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం విద్యార్థి క్లాస్ రూమ్ ముందే కుప్పకూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet