iDreamPost
android-app
ios-app

తమ్ముడికి లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన రాఘవ లారెన్స్! ప్రత్యేక కారణం ఉందట..

  • Published Jun 01, 2024 | 2:24 PM Updated Updated Jun 01, 2024 | 2:24 PM

తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు లారెన్స్. అయితే తాను ఇలా కాస్ట్లీ కారును బహుమతిగా ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు లారెన్స్. అయితే తాను ఇలా కాస్ట్లీ కారును బహుమతిగా ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

తమ్ముడికి లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన రాఘవ లారెన్స్! ప్రత్యేక కారణం ఉందట..

సెలబ్రిటీలు లగ్జరీ కార్లు, బంగళాలు, విల్లాలు కొనడం కొత్తేం కాదు. అలాగే వాటిని తమ వారికి బహుమతులుగా ఇవ్వడం కూడా కొత్త కాదు. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ చేరాడు. తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడు లారెన్స్. అయితే తాను ఇలా కాస్ట్లీ కారును బహుమతిగా ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పుకొచ్చాడు లారెన్స్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రాఘవ లారెన్స్.. తన మంచి మనసుతో ఇతరులకు సాయం చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. సాయం కోరి వచ్చిన వారికి లేదనకుంటా చేయి అందిస్తూ.. గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్నాడు. తాజాగా మరోసారి న్యూస్ లో నిలిచాడు. అయితే ఈసారి తన తమ్ముడికి కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా లారెన్స్ వెల్లడించాడు. తన తమ్ముడు ఎల్విన్ ను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నాడు లారెన్స్. ‘బుల్లెట్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

ఈ క్రమంలోనే విడుదలకు ముందు సినిమా చూసిన రాఘవ లారెన్స్.. తన తమ్ముడి నటనకు ఫిదా అయ్యాడు. “నేను నా తమ్ముడు నటించిన తొలి మూవీ ‘బుల్లెట్’ చూశాను. అందులో అతడి నటన అద్భుతం. అందుకే అతడికి ఇది నా గిఫ్ట్ గా ఇస్తున్నాను. నేను ఇది గౌరవంగా భావిస్తున్నాను. యూనిట్ మెుత్తానికి నా అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు. ఎల్విన్ ఫెర్పామెన్స్ నచ్చడంతో MG హెక్టార్ కారును బహుమతిగా ఇచ్చాడు. దాని ధర మార్కెట్ లో రూ. 20 నుంచి 25 లక్షల పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను లారెన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా.. గతేడాది ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం తమిళంలో రెండు మూవీలు చేస్తున్నాడు లారెన్స్. తెలుగులో అతడికి  ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి తమ్ముడికి కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ragava Lawrence (@actorlawrence)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş