iDreamPost
android-app
ios-app

వీడియో: ఉదయభాను అప్పటి ఫిగర్ అంటూ రచ్చ!

  • Published Sep 29, 2023 | 5:31 PM Updated Updated Sep 29, 2023 | 5:31 PM
  • Published Sep 29, 2023 | 5:31 PMUpdated Sep 29, 2023 | 5:31 PM
వీడియో: ఉదయభాను అప్పటి ఫిగర్ అంటూ రచ్చ!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు అలరిస్తున్నా.. కొంత మందికి మాత్రమే స్పాంటినిటీ.. కౌంటర్లు వేయగల సత్తా ఉంటుంది. అలాంటి యాంకర్లలో ముందు వరుసలో ఉంటారు యాంకర్ సుమ. టీవీ షోలు కానీ, సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రమోషన్లు, సక్సెస్ మీట్స్ ఏదీ చేసినా గలగలా మాట్లాడుతూ, నవ్వుతూ.. ఎదుట వారిని నోరు తెరవనివ్వకుండా ఎంటర్ టైన్ మెంట్ చేసేస్తుంటారు. అయితే సుమ ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్నా ఆమె కన్నా ముందు వచ్చి.. యాంకర్ అన్న పదానికి రెడ్ కార్పెట్ పరిచింది మాత్రం ఉదయ భానునే అనడంలో అతిశయోక్తి కాదు. ఇప్పుడంటే ఆమె హవా తగ్గింది కానీ గతంలో ఆమె క్రేజే వేరు. ఆమె మైక్ పట్టి యాంకర్ చేస్తుంటే.. టీవీలకు అతుక్కుపోయేవారు కుర్రాళ్ల నుండి ముసలోళ్ల వరకు.

అచ్చ తెలుగు అమ్మాయైన ఉదయ భాను కరీం నగర్‌లో పుట్టింది. సినిమాలపై మక్కువతో పరిశ్రమలోకి వచ్చిన ఆమె ఎర్ర సైన్యం వంటి సినిమాల్లో నటించింది. ఆ సమయంలో టీవీ రంగంలో విప్లవం మొదలైంది. 1995లో ఈటీవీ, జెమినీ టీవీ వంటి ఛానల్స్ వచ్చాయి. అప్పుడే యాంకర్‌గా అవతారమెత్తింది ఉదయభాను. హార్లిక్స్ హృదయాంజలి అంటూ ఈటీవీలో ఆమె చేసిన ప్రోగ్రామ్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. అటు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌తో పాటు అనేక షోలకు యాంకరింగ్ చేసింది. కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె నైజం. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, నువ్వు నేను, ఛాంగురే బంగారు రాజా, గోల్డ్ ర ష్, ఢీ వంటి ప్రోగ్రామ్ చేసింది. ఇంచు మించు తెలుగు ఛానల్స్ అన్నీంటిలోనూ మెరిసింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొవడంతో.. కెరీర్ గ్యాప్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీగా మారుతోంది.

సినిమా ఈవెంట్స్ చేస్తూ సందడి చేస్తోంది. మళ్లీ ఉదయభాను కనిపిస్తుండటంతో ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. ఇటీవల ఓ సినిమా ఈ వెంట్‌లో పాల్గొన్న ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. స్కంద కల్ట్ జాతర పేరుతో ఇటీవల కరీంనగర్‌లో ఓ కార్యక్రమం చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రచ్చ రవి మాట్లాడుతూ.. ఉదయ భానును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రవి మాట్లాడుతూ.. ‘రామ్ ఎనర్జీ రెడ్ బుల్ లా ఉంటుంది. ఉదయ భానును మైమ్ చేస్తూ మీకెవ్వరూ గుర్తుకు వస్తారు రా.. అనగానే నువ్వే.. అన్న వాడు ఎవరురా (ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడుతూ).. ఉదయ భాను గుర్తుకు వస్తాది రా ఇంకా. మేం చెడ్డీలు వేసినప్పటి ఫిగర్ ఆమె’ అంటూ కామెంట్ చేశాడు. అంతలో ఉదయ భాను మాట్లాడుతూ.. నువ్వు చెడ్డీ వేసినప్పుడు నేను పుట్టలేదు తెలుసా.. అంటూ కౌంటరిచ్చింది. అన్నీ పుకార్లు  ఆమె అనగానే.. సాక్ష్యం తన దగ్గర ఉందని, వన్స్ మోర్ ప్లీజ్ చేసేటప్పుడు.. ఆమె యాంకర్, తాను మిమిక్రీ ఆర్టిస్ట్ అంటూ.. గతం మర్చిపోకూడదంటూ రచ్చ రచ్చ చేశాడు రవి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio