iDreamPost
android-app
ios-app

ఫలించిన పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రయత్నం, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ….

  • Published Jan 26, 2022 | 6:22 AM Updated Updated Jan 26, 2022 | 6:22 AM
ఫలించిన పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రయత్నం, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ….

పుట్టపర్తి …
ఒక ప్రాంతంగా కన్నా అశేష జనవాహిని అభిమానం చూరగొన్న శ్రీ సత్యసాయి బాబా పేరులో భాగంగానే బహిరంగ ప్రపంచానికి పరిచయం అయిన పేరు పుట్టపర్తి .ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని కలిగి ఉన్న సత్యసాయిబాబా తనకున్న అభిమాన బలాన్ని పుట్టపర్తి ప్రాంత అభివృద్ధికి ఆలంబనగా మలిచారు .

గుక్కెడు త్రాగునీటికి కూడా అలమటించే పుట్టపర్తికి సత్యసాయి ట్రస్ట్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు సాధారణ వైద్యానికి కూడా నోచుకోని చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పి ఆ ప్రాంత వాసులకే కాక దూర ప్రాంత ప్రజలకు కూడా వైద్య సేవలు ఉచితంగా అందించటమే కాక ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు స్కూల్స్ , కాలేజీలు నిర్మించి విద్యార్థులకు పూర్తి ఉచిత విద్య అందించటంతో ఉన్నత విద్య కోసం అనంతపురం , బెంగుళూరు వెళ్లలేక చదువు చాలించే పుట్టపర్తి వాసుల పాలిట వరమయ్యింది సత్యసాయి ట్రస్ట్ .

పార్లమెంట్ స్థానాల ప్రతిపాదికన జిల్లాల పునర్విభజన దిశగా ప్రభుత్వం యోచిస్తున్న రోజుల్నుండీ కడప బెంగుళూరు రోడ్ కనెక్టివిటీ ఉండి , ఇండస్ట్రియల్ పరంగా , వ్యవసాయ ఎగుమతుల పరంగా అనుకూలతలు ఉన్న పుట్టపర్తిని జిల్లాగా చేస్తే మరింత వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయనే ప్రతిపాదన చేసిన స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈ అంశం పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాయటంతో పాటు పలుమార్లు స్థానిక ప్రతినిధులతో ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు .

అంతే కాక పూర్తి వెనుకబాటు ప్రాంతమైన పుట్టపర్తి నియోజకవర్గం పలు విధాల అభివృద్ధి చెందటానికి కారణమైన శ్రీ సత్యసాయి పేరుని జిల్లా పేరుగా నిర్ణయించాలని దుద్దుకుంట చేసిన విన్నపాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు జిల్లాల పునర్విభజనలో స్థానిక ఆకాంక్షలకు అనుగుణంగా పుట్టపర్తి ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పుట్టపర్తి పట్టణాన్ని కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాని ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసారు .