iDreamPost
android-app
ios-app

రష్మికతో ఫొటో దిగేందుకు పోటీపడిన అభిమాని.. అడ్డుకున్న బాడీగార్డ్.. ఆగండి అంటూ ఆ హీరోయిన్

  • Published Jun 14, 2022 | 6:40 PM Updated Updated Jun 14, 2022 | 6:40 PM
  • Published Jun 14, 2022 | 6:40 PMUpdated Jun 14, 2022 | 6:40 PM
రష్మికతో ఫొటో దిగేందుకు పోటీపడిన అభిమాని.. అడ్డుకున్న బాడీగార్డ్.. ఆగండి అంటూ ఆ హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి చెప్పాలంటే.. పుష్ప కి ముందు.. పుష్ప తర్వాత. పుష్ప : ది రైజ్ సూపర్ సక్సెస్ అవడంతో.. రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించింది. త్వరలోనే రష్మిక బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. దానితో పాటు మరో రెండు హిందీ సినిమాలను కూడా లైన్లో పెట్టింది.

కాగా.. ఈ బ్యూటీ నిన్న ముంబైలో దర్శనమిచ్చింది. వైట్ అండ్ వైట్ డ్రస్సులో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలో అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. కానీ.. ఆమె బాడీగార్డులు అభిమానిని ఆపేందుకు ప్రయత్నించగా.. “అలా చేయవద్దు..ఆగండి” అంటూ రష్మిక ఆ అభిమానితో ఫొటో దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. “సౌత్ స్టార్స్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్ .. బాలీవుడ్ వాలాస్ లాగా అహంకారం లేదు” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు.. సౌత్ లోనూ రష్మిక చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. సీతా రామం, తలపతి 66, పుష్ప 2: ది రూల్ వంటి సినిమాలతో రష్మిక బిజీ బిజీగా ఉండనుంది.

పుష్ప 2: ది రూల్ సినిమా పుష్ప: ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప: ది రైజ్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్లు, హిందీ డబ్బింగ్ వెర్షన్ రూ.108.26 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2: ది రూల్ అంతకుమించిన వసూళ్లు చేస్తుందని భారీ అంచనాలున్నాయి. రష్మిక నటించిన మిషన్ మజ్ను ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss