iDreamPost
android-app
ios-app

పుష్ప బ్యాక్‌ డ్రాప్‌ మారిందా?.. మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్‌గా పుష్ప రాజ్‌!

పుష్ప బ్యాక్‌ డ్రాప్‌ మారిందా?.. మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్‌గా పుష్ప రాజ్‌!

తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘ పుష్ప-2’. అల్లు అర్జున్‌, రష్మికా మందన్న, ఫాహద్‌ ఫాజిల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. పుష్ప -1 సాధించిన ఘన విజయంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని.. దర్శకుడు సుకుమార్‌ సినిమాను వేరే లెవల్లో తీస్తున్నట్లు సమాచారం. అందుకే భారీ తారాగణాన్ని రంగంలోకి దింపారు.

అంతేకాదు! కథను మరింత పగడ్భందీగా మార్చారట. పుష్ప- దిరైజ్‌ మొత్తం 1990ల కాలంలో జరిగింది. ఇప్పుడు వస్తున్న పుష్ప-ది రూల్‌ 2000 కాలంలో జరగనుందట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. పుష్ప-ది రూల్‌లో అల్లు అర్జున్‌ చిరంజీవి ఫ్యాన్‌గా కనిపించనున్నారట. ఇంద్ర సినిమా రిలీజ్‌ అయిన సమయానికి సంబంధించిన సన్నివేశాలు ఉండనున్నాయట. సినిమాలో పుష్ప రాజ్‌ తాను మెగాస్టార్‌ చిరంజీవి అభిమానినని పలు సార్లు చెబుతాడట.

దర్శకుడు సుకుమార్‌.. మెగాస్టార్‌ సీన్లు వచ్చినపుడు థియేటర్లలో ఈలలు పడేలా.. సీన్లను ఓ లెవెల్లో తీర్చి దిద్దుతున్నారట. ప్రస్తుతం ఆయా సీన్ల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు సినిమా ఫుల్‌ మీల్స్‌ కానుందని చెప్పటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ఈ పుకార్లలో నిజం ఎంతుందో తెలియాలంటే.. సినిమా థియేటర్లలోకి రావాల్సిందే. మరి, పుష్ప-ది రూల్‌లో అల్లు అర్జున్‌.. మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్‌ కనిపించనున్నాడన్న ఈ పుకార్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş