iDreamPost
android-app
ios-app

తగ్గేదేల్యా…ఇంటర్నేషనల్ రేంజిలో పాపులర్ అయిన “పుష్ప” స్టైల్

తగ్గేదేల్యా…ఇంటర్నేషనల్ రేంజిలో పాపులర్ అయిన “పుష్ప” స్టైల్

అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు సంచలనాలను నమోదు చేస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం కూడా అభిమానులతో పాటుగా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. పుష్ప సినిమా లో డైలాగులు కొన్ని పాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. మన తెలుగు ప్రేక్షకులు పేర్లు పెట్టిన ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చింది.

ఇండియన్ క్రికెటర్ లతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో పేరున్న క్రికెటర్లు కూడా పుష్ప సినిమాలో సన్నివేశాలు కు సంబంధించి సోషల్ మీడియాలో డైలాగులను రీమేక్ చేస్తూ… సందడి చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగే ఇండియన్ క్రికెటర్లు సురేష్ రైనా, ఇషాన్ కిషన్ రవీంద్ర జడేజా వంటి వారు కూడా సోషల్ మీడియాలో పుష్ప సినిమా పేరుతో సందడి చేస్తున్నారు. ఇక పాటలు దాదాపుగా అన్నింటికి మంచి స్పందన వచ్చింది.

పుష్పాలో బాగా సక్సెస్ అయిన శ్రీ వల్లి పాటకు డాన్స్ చేస్తూ అంతర్జాతీయ క్రికెటర్లు సందడి చేయడం కాస్త అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. రవీంద్ర జడేజా పలు డైలాగులను తన ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించి యూయేఫా ఛాంపియన్స్ లీగ్ కూడా తన సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. గోల్ కొట్టిన సందర్భంగా ఒక ప్లేయర్ సెలబ్రేట్ చేసుకునే క్రమంలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ గడ్డం రుద్దుకునే సిగ్నేచర్ మూమెంట్ తో సెలెబ్రేట్ చేసుకున్నాడు. దీనిని హిందీ డైలాగ్ తో పోస్ట్ చేసారు.

సినిమాలో క్లైమాక్స్ విషయంలో మన తెలుగు వాళ్ళు కంప్లైంట్ చేసినా సరే అల్లు అర్జున్ నటనకు బాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. పుష్ప సినిమా టేకింగ్ కూడా అద్భుతంగా రావడం, పాటలు కూడా లిరిక్స్ అందంగా ఉండటం, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా బాగుండటంతో కమర్షియల్ హిట్ తో పాటు మ్యూజికల్ హిట్ కూడా అయింది. ఫాహాద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటించడం, క్లైమాక్స్ లో అతని ఎంట్రీ ఉండటంతో ఇద్దరి మధ్య వచ్చే సీన్ లు ఎలా ఉంటాయో అని ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş