iDreamPost
android-app
ios-app

నాలుగేళ్ల డేటింగ్ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న తీన్‌మార్ హీరోయిన్

టాలీవుడ్ బ్యూటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫిబ్రవరిలో ప్రియుడ్ని పెళ్లాడబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరోో బ్యూటీ కూడా ఈ బాటలోనే నడుస్తుందని టాక్..

టాలీవుడ్ బ్యూటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫిబ్రవరిలో ప్రియుడ్ని పెళ్లాడబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరోో బ్యూటీ కూడా ఈ బాటలోనే నడుస్తుందని టాక్..

నాలుగేళ్ల డేటింగ్ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న తీన్‌మార్ హీరోయిన్

’వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టి.. గుండెల్లోనా చేరావే గంటె కొట్టి‘ అంటూ తీన్‌మార్ మూవీలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మనస్సునే కాదూ.. అనేక మందిని ఫిదా చేసిన బ్యూటీ కృతి కర్బందా. ఇప్పుడు హిందీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది. ఎంతో మంది హీరోయిన్లకు టాలీవుడ్ లైఫ్ ఇచ్చినట్లుగా.. ఆమెకు కూడా మంచి యాక్ట్రస్‌గా మారేందుకు మంచి అవకాశమే ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. బోణీ అనే తెలుగు సినిమాతోనే నటనలోకి అడుగు పెట్టిన ఆమె.. ఇక్కడ టాప్ స్టార్స్ పక్కన ఆడిపాడింది. పవన్ కళ్యాణ్‪తో తీన్ మార్, మంచు మనోజ్ సరసన మిస్టర్ నూకయ్య, రామ్ పోతినేనితో ఒంగోలు గిత్తలో నటించింది. బ్రూస్ లీలో రామ్ చరణ్ అక్కగా చేసింది.

అక్కగా చేస్తే.. ఇక టాలీవుడ్ లో అలాంటి అవకాశాలు వస్తాయేమో అనుకుందేమో ఏమో.. వెంటనే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ రాజ్ అనే హార్రర్ మూవీలో చేసింది. అటు కన్నడ, తమిళ్ సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్‌లో పాగా వేసింది. ఇప్పుడు ఈ అమ్మడు సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తుంది. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్..నటుడు పులకిత్ సామ్రాట్ తో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా, పులకిత్ గతంలో రోహిరా అనే అమ్మాయితో వివాహం అయ్యింది. 2015లో ఈ జంట విడిపోగా.. 2019లో  కృతి కర్భందాతో ప్రేమ జర్నీ స్టార్ చేశాడు. వీరిద్దరూ కలిసి వీర్ కి వెడ్డింగ్, పాగల్ పంటి,  తైష్ వంటి చిత్రాల్లో నటించారు.

నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఎట్టకేలకు ఎంగేజ్ మెంట్ చేసుకుంది. కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య రోఖా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన పిక్స్ హీరో పులకిత్.. తొలుత తన ఇన్ స్టా స్టోరీలో డ్రాప్ చేశాడు. మరీ ఏమైందో తెలియదు.. ఇప్పుడు అవి కనిపించడం లేదు. ఇందులో కృతిని హత్తుకుని కనిపించాడు. అందులో వీరిద్దరూ ఒకే రకమైన రింగ్స్ తో కనిపించగానే.. నిశ్చితార్థం జరిగిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. గత ఏడాది కృతి కర్బంధా, పులకిత్ సామ్రాట్ ఒకరికొకరు సోషల్ మీడియా వేదికగా.. శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అయితే ఈ వార్తా కథనాలపై ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis