iDreamPost
android-app
ios-app

హ్యారీపోటర్ తరహాలో రాజాసాబ్.. చిన్న కథ కాదు!

  • Published Nov 13, 2024 | 3:43 PM Updated Updated Nov 13, 2024 | 3:43 PM

Rajasaab Movie Updates: డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఖుషి ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో వరుస ప్రాజెక్ట్స్ ను టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ రాజాసాబ్ గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

Rajasaab Movie Updates: డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఖుషి ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో వరుస ప్రాజెక్ట్స్ ను టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ రాజాసాబ్ గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

  • Published Nov 13, 2024 | 3:43 PMUpdated Nov 13, 2024 | 3:43 PM
హ్యారీపోటర్ తరహాలో రాజాసాబ్.. చిన్న కథ కాదు!

డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఖుషి ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో వరుస ప్రాజెక్ట్స్ ను టేక్ ఓవర్ చేస్తున్నాడు. కనీసం ఏడాది రెండు సినిమాల రిలీజ్ పక్కా. ఈ విషయంలో డోకా లేదు. ప్రభాస్ సూపర్ స్పీడ్ లైన్ అప్స్ గురించి తెలిసిన వారంతా కూడా ఈ విషయాన్నీ ఒప్పుకుని తీరాల్సిందే. వీటి అన్నిటిలో ముందుగా మ్యాజిక్ చేయబోతున్న సినిమా రాజాసాబ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వినిపిస్తున్న బజ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ సినిమా గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సలార్ , కల్కి సినిమాల తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మొదట మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అనగానే అందరూ కాస్త షాక్ అయిన మాట వాస్తవం. సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ కూడా వచ్చింది. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఫ్యాన్స్ తో పాటు రాజాసాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

రాజాసాబ్ నుంచి వస్తున్న ఒక్క అప్డేట్.. ఒక్కో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఇది ప్రభాస్ కెరీర్ లోనే ఎప్పుడు టచ్ చేయని క్యారెక్టర్. ఒక హీరోగా ప్రభాస్ ను అంతా చూసారు కానీ.. ఒక ఘోస్ట్ గా మాత్రం ఎవరు ఎప్పుడు చూడలేదు. దీనితో సినిమా మీద ఇంకాస్త ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. దానికి తోడు ప్రభాస్ లుక్స్ , గెటప్ ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇక నిర్మాత కూడా రాజాసాబ్ చిన్న కథ కాదు , చిన్న సినిమా కాదు అంటూ చెప్పుకొచ్చారు. పైగా వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ మూవీ కానుందని హైప్. దీనితో సినిమా మీద ఆశలు , అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. . ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు రాజాసాబ్ నుంచి వినిపిస్తున్న వార్తా వింటే.. పోతారు హైప్ తో మొత్తం పోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజాసాబ్ లో కొన్ని సీన్స్ హాలీవుడ్ మూవీ హ్యారీపోటర్ ను తలపించేలా ఉంటాయట. బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి.

హ్యారీపోటర్ సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఆ స్టోరీస్ నచ్చని వారు ఎవరు ఉండరు. నిర్మాత ఏ రకంగా చెప్పారో తెలియదు. కానీ ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను గమనిస్తే కాస్త పోలికలు ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజం అయితే మాత్రం.. రాజాసాబ్ మీద వద్దన్నా కాసుల వర్షం కురుస్తుంది. ఈ న్యూస్ ఇప్పటివరకు క్రియేట్ అయినా ఎగ్జైట్మెంట్ లో స్పైస్ ను యాడ్ చేసిందని చెప్పి తీరాలి.  సహజంగా సినిమా రిలీజ్ ముందు అంచనాలు , ఇలాంటి కంపారిజన్స్ వస్తూనే ఉంటాయి. డార్లింగ్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా అంటే ఇంకాస్త జోరుగా వస్తుంటాయి. అయితే రిలీజ్ తర్వాత ఆ అంచనాలు ఎంతవరకు నిలబడతాయనేదే మ్యాటర్. ఒకవేళ మేకర్స్ ఆ అంచనాలు అందుకోకపోతే.. సోషల్ మీడియాలో అదే రకమైన ట్రోలింగ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని సినిమాల విషయంలో అది ప్రూవ్ అయింది. ఇక మారుతి రాజాసాబ్ తో ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş