iDreamPost
android-app
ios-app

OTT ఫ్యాన్స్ కు ప్రైమ్ కానుకలు

  • Published Jul 09, 2021 | 7:40 AM Updated Updated Jul 09, 2021 | 7:40 AM
OTT ఫ్యాన్స్ కు ప్రైమ్ కానుకలు

గత ఏడాదిలాగా ఈసారి టాలీవుడ్ లో ఓటిటిల జోరు అంతగా లేదు. వెళ్లాలనుకున్నరెండు మూడు కూడా ఇప్పుడు థియేటర్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ మనసు మార్చుకున్నాయి. అయితే ఇతర భాషల్లో మాత్రం ఇవి యధావిధిగా కొనసాగుతున్నాయి. చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్న సినిమాలే వరసబెట్టి డిజిటల్ ప్రేక్షకుల కోసం క్యూ కడుతున్నాయి. వీటిలో కొన్ని డబ్బింగ్ రూపంలో కూడా అందించబోతున్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది 16న రానున్న ఫర్హాన్ అక్తర్ నటించిన తుఫాన్. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ భాగ్ మిల్కా బాగ్ కాంబోలో రూపొందటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక పుష్పలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ చేసిన గ్యాంగ్ స్టర్ డ్రామా మాలిక్ 15న ప్రైమ్ లో రాబోతోంది. ట్రైలర్ వచ్చాక హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. దృశ్యం 2 తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ దీనికే వస్తుందని మల్లువుడ్ లో పెద్ద టాకే నడుస్తోంది. వరుడులో ప్రతినాయకుడిగా చేసిన ఆర్య ప్రధాన పాత్రలో కాలా కబాలి ఫేమ్ పా రంజిత్ రూపొందించిన సరపట్ట కూడా 22న ఆడియన్స్ దగ్గరకు నేరుగా వచ్చేయబోతోంది. దీన్ని తెలుగులో డబ్బింగ్ చేసి అందించబోతున్నారు. కన్నడ మూవీ ఇక్కట్ దీనికి ఒక రోజు ముందు జూలై 21న ప్రీమియర్ చేయబోతున్నారు. బాష రాని వాళ్ళు సబ్ టైటిల్స్ తో చూస్తున్న ట్రెండ్ లో ఇప్పుడిదేమి సమస్య కాదు

వాస్తవానికి నారప్పను 24న ప్రీమియర్ చేస్తారనే వార్తలు గట్టిగా షికారు చేశాయి. నిన్న ప్రకటించిన ఈ లిస్టుని బట్టి చూస్తే అది లేదని క్లియర్ గా అర్థమైపోయింది. అయితే సురేష్ సంస్థ నుంచి ఆ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే వస్తుందనే పోస్టర్ కానీ ప్రకటన కానీ రాకపోవడం అనుమానాలను పూర్తిగా తొలగించలేదు. ఏది ఎలా ఉన్నా ప్రైమ్ మాత్రం లాక్ డౌన్ వెర్షన్ 2ని బాగానే వాడుకుంటోంది. తెలుగులో ఏక్ మినీ కథ లాంటి ఒకటి అరా తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ ప్రీమియర్లు జరగలేదు. థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో మన మూవీ లవర్స్ కి ఎంటర్ టైన్మెంట్ ఇకపై పెద్ద స్క్రీన్ మీదే అని ఫిక్స్ అయిపోవచ్చు

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet