iDreamPost
android-app
ios-app

భయంకరమైన బూతు పోస్టర్

భయంకరమైన బూతు పోస్టర్

బూతు అనేది బొమ్మలోనే కాదు, పదాల్లో కూడా ఉంటుంది. ఒక్కోసారి బొమ్మని ఆర్టిస్టిగ్గా చూడండి అని ఆర్గ్యుమెంట్ పెట్టొచ్చుగానీ పదాలు అలా కాదు. అర్జున్ రెడ్డి పుణ్యమా అని బూతు ఫ్యాషన్ అయి కూర్చుంది ఒక వర్గంలో. సినిమాకి పబ్లిసిటీ రావాలంటే బూతు ఎఫెక్ట్ ఉండాలని గట్టిగా నమ్ముతున్నట్టు ఉన్నారు కొందరు.

తాజాగా ఈ సంక్రాంతి సీజన్లో కొన్ని మల్టీప్లెక్సుల్లో దర్శనం ఇస్తున్న ఈ పోస్టర్ చూడండి. “ప్రేమ పిపాసి” టైటిల్. అందులో సమస్యేమీ లేదు. కానీ పక్కన నిలువుగా రాసి పెట్టిన రెండు వాక్యాలు చూడండి. ఎంత మధ్యలో చుక్కలు పెడితే మాత్రం 100 కి 100 శాతం మందికి తట్టే పదం తట్టకుండా పోతుందా? ఇలా బూతు పదంతో సినిమాని మార్కెట్ చేసుకోవాలనుకోవడం నిజంగా చీపుగానే ఉంది. అయితే వాళ్ల టార్గెట్ ఆడియన్సుకి అలా అయితేనే చేరుతుంది అని వాళ్లు ఆర్గ్యూ చేస్తే చేయకలిగేది ఏమీ లేదు.

పోస్టర్లని కూడా స్క్రీనింగ్ చేసి విడుదల చెయ్యాలని సెన్సార్ రూల్ పెడితే బెటరేమో అని కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ అనుకుంటున్నారు. 

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet