iDreamPost
android-app
ios-app

దారుణం.. భర్త కళ్లెదుటే నిండు గర్భిణీపై గ్యాంగ్ రేప్

  • Published Jun 06, 2022 | 12:31 PM Updated Updated Jun 06, 2022 | 12:31 PM
  • Published Jun 06, 2022 | 12:31 PMUpdated Jun 06, 2022 | 12:31 PM
దారుణం.. భర్త కళ్లెదుటే నిండు గర్భిణీపై గ్యాంగ్ రేప్

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నా, పెద్ద, ముసలి, ముతక.. ఆఖరికి నిండు గర్భిణీలను కూడా వదలడం లేదు కామాంధులు. పశువాంఛ తీర్చుకునేందుకు వావి వరసలు మరిచి.. మానవత్వం లేని రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నిండు గర్భిణీ పై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది.

మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో జరిగిందీ దారుణ ఘటన. పంజాబ్ ప్రావిన్స్ లో ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న భార్య భర్తల్లో.. భర్తను కొట్టి, కట్టేసి.. అతని కళ్లెదుటే గర్భిణీగా ఉన్న భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఐదుగురు దుర్మార్గులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం మహిళ ఆస్పత్రికి వెళ్లగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు గర్భిణీ స్త్రీ నుంచి వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్యులు బాధితురాలి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. కాగా.. గతనెల కరాచీలో కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇప్పుడు మరోసారి.. అందునా గర్భిణీపై గ్యాంగ్ రేప్ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş