iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న పాదఘట్టం!

  • Published Dec 18, 2022 | 12:08 AM Updated Updated Dec 18, 2022 | 12:08 AM
  • Published Dec 18, 2022 | 12:08 AMUpdated Dec 18, 2022 | 12:08 AM
ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న పాదఘట్టం!

పాదఘట్టం పేరు వింటే మెగా అభిమానులు ఉలిక్కిపడతారు. దానికి కారణం చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. పాదఘట్టం పాదఘట్టం అంటూ చివరికి సినిమాని నేలమట్టం చేశారంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. అందుకే ‘ఆచార్య’, ‘పాదఘట్టం’ అనే మాటలు వింటే మెగా ఫ్యాన్స్ ఉలిక్కిపడతారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం పాదఘట్టం పేరు వింటే భయపడుతున్నారు. వాళ్ళు అలా భయపడటానికి కారణం దర్శకుడు మారుతి.

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘అది పురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ k’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే ఊహించని విధంగా మారుతి దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ చిత్రం చేయడానికి ప్రభాస్ అంగీకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ మూవీ చేయొద్దంటూ ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు. కానీ ప్రభాస్ మాత్రం సైలెంట్ గా మారుతి మూవీని మొదలుపెట్టాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక రాలేదు కానీ ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇటీవల రెండో షెడ్యూల్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న లొకేషనే ప్రభాస్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది.

హైదరాబాద్ శివారులో ఆచార్య చిత్రం కోసం వేసిన పాదఘట్టం సెట్ లో ప్రస్తుతం ప్రభాస్-మారుతి ఫిల్మ్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. పాదఘట్టం నెగటివ్ సెంటిమెంట్ కూడా తోడవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించిన సినిమాలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. మరి మారుతి కూడా అలాంటి మ్యాజిక్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరినీ ఆశ్చర్యపరుస్తాడేమో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet