iDreamPost
android-app
ios-app

ఈ బిగ్ బాస్ స్టార్ ఎందుకు సీరియ‌ల్స్ వ‌దిలేసి, పొలం ప‌నిచేస్తున్నారు?

  • Published Jul 08, 2022 | 2:55 PM Updated Updated Jul 08, 2022 | 2:55 PM
  • Published Jul 08, 2022 | 2:55 PMUpdated Jul 08, 2022 | 2:55 PM
ఈ బిగ్ బాస్ స్టార్ ఎందుకు  సీరియ‌ల్స్ వ‌దిలేసి, పొలం ప‌నిచేస్తున్నారు?

అగ్లే జనమ్ మోహే బితియా హాయ్ కిజో (Agle Janam Mohe Bitiya Hi Kijo), బిగ్ బాస్ 7 స్టార్ రతన్ రాజ్‌పుత్ షోబిజ్‌ను వ‌దిలేశారా? సొంతూళ్ల‌లో వ్య‌వ‌సాయం చేస్తున్నారా? ఆమె పొలంలో పనిచేస్తున్న ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్‌గా మారాయి. బిగ్ బాస్ 7లో త‌న యాటిట్యూడ్ తో బాగా పాపుల‌ర్ అయిన‌
రతన్ రాజ్‌పుత్ నెల‌కు ల‌క్ష‌లు తెచ్చిపెట్టే సీరియ‌ల్ యాక్టింగ్ ను ఎందుకు వ‌దిలేశారు?

టీవీ నటి రతన్ రాజ్‌పుత్ అగ్లే జనమ్ మోహే బితియా హి కిజో వంటి షోలతో పాపుల‌ర్ అయ్యారు. ఆమె గ్లామ‌ర్ ప్రపంచం ముంబైని వ‌దిలిపెట్టి, బీహార్‌లో ఉంటున్నారు. త‌న‌కున్న పొలంలో ప‌నిచేస్తున్నారు. ఆ ఫోటోల‌ను ఇప్పుడు షేర్ చేయ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి.

గులాబీ రంగు చీరలో రతన్ రాజ్‌పుత్ ఇతర మహిళలతో కలిసి పొలంలో దిగారు. బుర‌ద‌లో హ్యాపీగా ప‌నిచేస్తున్నారు.

ఈ ఫోటోల‌కు రతన్ రాజ్‌పుత్ ‘మట్టిని రుచి చూడు, మట్టిని రక్షించు అంటూ ఉత్తేజకరమైన క్యాప్ష‌న్ రాశారు.

రతన్ రాజ్‌పుత్ న‌టనను వదిలివేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. చాలామంది అదే అనుకున్నారు. కాని ఆ క్యాప్ష‌న్ లోనే ఇంకో హింట్ కూడా ఉంది. పల్లెటూరి జీవిత‌మే అత్యుత్తమ వర్క్‌షాప్‌ అని, చాలా పాత్రల్లోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయ‌డానికి ఇది హెల్ప్ అవుతుంద‌ని చెప్పింది. అంటే ఇంకా నటిగా కొన‌సాగాల‌నే ఆసక్తి ఆమెకు ఉంది.

మొత్తానికి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ వ్య‌వ‌సాయంపై త‌న ఇంట్రెస్ట్ ను చూపించే ఫోటోల‌ను షేర్ చేయ‌డం ఇదే మొదటిసారి కాదు. గతంలో, ఊళ్ల‌లో తిరుగుతూ, ఆ మ‌ట్టిలో న‌డుస్తూ, గ్రామీణ జీవితాన్ని ఆస్వాదించే చాలా ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక కోవిడ్ లాక్ డౌన్ స‌మ‌యంలో, ఆమె త‌న ఊళ్ల‌లోనే ఉంటూ అక్క‌డి అనుభ‌వాల‌ను షేర్ చేయ‌డం ఆమె ఫ్యాన్స్ కు బాగా న‌చ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet