iDreamPost
android-app
ios-app

SSMB28 సినిమా షూటింగ్ కు ముందు, మూడు ఖండాల్లో విహారయాత్రకు పూజా హెగ్డే

  • Published Jul 09, 2022 | 8:44 PM Updated Updated Jul 09, 2022 | 9:08 PM
  • Published Jul 09, 2022 | 8:44 PMUpdated Jul 09, 2022 | 9:08 PM
SSMB28 సినిమా షూటింగ్ కు ముందు, మూడు ఖండాల్లో విహారయాత్రకు పూజా హెగ్డే


కొన్ని ఫ్లాప్ లు త‌గిలినా క్రేజ్ మాత్రం త‌గ్గిన హీరోయిన్ పూజా హెగ్డే. ఆమెకు వ‌ర‌స‌పెట్టి ఆఫ‌ర్లు. తాజాగా సూర్య‌తోనే యాక్ట్ చేయ‌నుంది. ఆమె డైరీ ఈయేడాది అంతా ఫుల్. ఆగస్ట్ మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆమె కెరీర్ కు ఇది బూస్ట్ నివ్వ‌నుంది. SSMB28 షూటింగ్‌ని ప్రారంభించే ముందు, పూజ కాస్త రిలాక్స్ అవ‌డానికి విహార‌యాత్ర‌కు బ‌య‌లుదేరింది. మొత్తం ఆమె మూడు ఖండాల్లో విశ్రాంతి తీసుకొంటుందంట‌.

కొద్దిసేప‌టి క్రితం, పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో తన పాస్‌పోర్ట్ మరియు బోర్డింగ్ పాస్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. దీనికి జిప్సీ లైఫ్ జ‌ర్నీ అనిపెరుకూడా పెట్టింది. కొన్ని వారాల పాటు నాలుగు సిటీల‌ను చుట్టబెట్టేయ‌నుంది. పూజ మొదట బ్యాంకాక్‌కు వెళుతుంది. ఎయిర్ పోర్ట్ గ్యాంగ్‌వే నుండి ఫోటోను షేర్ చేస్తూ, “1 నెల. 3 ఖండాలు. 4 నగరాలు. వెళ్దాం. #జిప్సీగర్ల్” అని క్యాప్ష‌న్ రాసింది.

ఆమెకు జిప్సీ లైఫ్ అంటు చాలా ఇంట్రెస్ట్. బ్యాంకాక్ కు త‌ర‌చు వెళ్తుంది. ఓరియంట‌ల్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. బ్యాంకాక్‌లో మ్యూజిక్ ను ఆస్వాదిస్తూ క‌నిపించింది. బ్యాంకాక్ వీధుల్లోని కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది. పూజా న‌చ్చిన ఫుడ్ తింటూ, విశ్రాంతిని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.

పూజా హెగ్డే నెక్ట్స్ మూవీ మహేష్ బాబుతోనే. త్రివిక్రమ్ తర్వాతి సినిమా కోసం వీరిద్దరూ క‌ల‌సి న‌టించ‌నున్నారు. ఈ చిత్రం ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. టీజ‌ర్ వీడియో కొన్ని గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio