iDreamPost
android-app
ios-app

వేగవంతంగా పోలవరం పనులు: పోలవరం పై సీఎం జగన్ మార్క్

  • Published Nov 21, 2019 | 1:10 PM Updated Updated Nov 21, 2019 | 1:10 PM
వేగవంతంగా పోలవరం పనులు:   పోలవరం పై సీఎం జగన్ మార్క్

అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలవరం పనులను పరుగులు పెట్టిస్తున్నారు. అనుకున్నదానికంటే ముందుగానే పూర్తిచేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. గురువారం రోజు స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటిరోజు 100 క్యూబిక్ మీటర్ల పనిని పూర్తిచేయనున్ననారు. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది మేఘా ఇంజనీరింగ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్ల పాల్గొన్న ఎంఇఐఎల్ పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకొని ఈ నెల ఒకటో తేదీన ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి 782 కోట్ల రూపాయలు ఆదా అయింది.

మొదటిగా మేఘా ఇంజనీరింగ్ భారీ వర్షాల వాళ్ళ దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం లోని రోడ్లను మరమ్మతులు చేసి ఆ ప్రాంతాన్ని నిర్మాణానికి అనుకూలంగా తీర్చిదిద్దింది. తాజాగా కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టింది. స్పిల్ వే ప్రాంతంలో పనులను గురువారం ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన సమయానికి కాంక్రీట్ వేయటం ప్రారంభించిన మేఘా సంస్థ ప్రతినిధులు తోలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. ఈ పరిమాణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతామని ఎంఇఐఎల్ సంస్థ జనరల్ మేనేజర్ అంగర సతీష్ బాబు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాలను అనుగుణంగా ప్రస్తుతం స్పిల్ వే వద్ద పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వర్షపు నీరు ఎక్కువగా ఉంది. ఆ నీటిని తొలుత సాధారణ ప్రవాహం ద్వారా తగ్గించే ఏర్పాట్లను మేఘా సంస్థ చేసింది. నీటి మట్టం కొంత తగ్గిన తరువాత మోటార్లను ఉపయోగించి ఆ నీటిని నిర్మాణ ప్రాంతం నుంచి పూర్తిగా తొలగిస్తామని సతీష్ చెప్పారు. స్పిల్ వేలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు ఇంకా చేయాల్సి ఉంది. స్పిల్ ఛానల్ లో 5.3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. స్పిల్ చానల్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉంది. ఈ నీరు తగ్గిన తరువాత అక్కడ పనులు చేపట్టనుంది మేఘా ఇంజనీరింగ్. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్ పనులను ఒకదాని వెనుక ఒకటి ప్రారంభిస్తామని సతీష్ బాబు చెప్పారు. రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను చేయాల్సి ఉంది. ఈ పనులను వచ్చే సీజన్లో అంటే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని సతీష్ చెప్పారు. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet