iDreamPost
android-app
ios-app

రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.8 వేలు.. బడ్జెట్‌లోనే ప్రకటన!

  • Published Jun 23, 2024 | 12:55 PM Updated Updated Jun 23, 2024 | 12:55 PM

త్వరలోనే అనగా జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..

త్వరలోనే అనగా జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jun 23, 2024 | 12:55 PMUpdated Jun 23, 2024 | 12:55 PM
రైతులకు మోదీ సర్కార్‌ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.8 వేలు.. బడ్జెట్‌లోనే ప్రకటన!

అన్నదాతలను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకొస్తున్నాయి. వారికి పెట్టుబడి సాయం అందించడం మాత్రమే కాక.. పంటకు మద్దతు ధర కల్పించడమే కాక.. ప్రకృతి వైపరీత్యాల వేళ అన్నదాతలను కాపాడుకోవడం కోసం బీమా పథకాలను కూడా తీసుకువస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రైతులను ఆదుకోవడం కోసం.. ఎకరానికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం కోసం అనేక పథకాలను తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఓ వార్త నేషనల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి ఖాతాలో 8 వేల రూపాయలు వేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన సమ్మాన్‌ నిధి కింద పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 16 విడతల డబ్బులు విడుదల చేయగా.. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలై.. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ.. పీఎం కిసాన్‌ యోజన 17వ విడత నిధుల విడుదల ఫైల్‌ మీదనే సంతకం చేశారు. దానిలో భాగంగా రూ.20 వేల కోట్లు విడుదల చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వారణాసిలో పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత విడుదల చేశారు. రైతులు ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.2 వేల చొప్పున జమ అయ్యాయి. ఈక్రమంలో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

Modi sarkar

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన నిధులు పెంచేందుకు రెడీ అవుతోందని సమాచారం. ఇప్పటి వరకు ఎకరాకు అందిస్తోన్న 6 వేల రూపాయల సాయాన్ని.. 8 వేల రూపాయలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోందట. వాస్తవంగా అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌లోనే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పీఎం కిసాన్‌ యోజన పెంపుపై ప్రకటన చేస్తారని భావించాయి. కానీ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. త్వరలోనే అనగా.. జులై, 2024లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధి సాయం పెంపుపై చర్చ మొదలైంది.

పీఎం కిసాన్‌ సాయాన్ని రూ.6 వేల నుంచి రూ. 8 వేలకు సాయాన్ని పెంచితే కేంద్రంపై అదనంగా మరో రూ.15 వేల కోట్ల భారం పడనుంది. అయినప్పటికీ పెట్టుబడి సాయం పెంచి రైతులకు చేరువవ్వాలని కేంద్రం ఆలోచిస్తోందని సమాచారం. ఈ కారణంగానే వచ్చే పూర్తి స్థాయి బడ్జెట్‌లో రైతులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పనుందనే వార్తలు వెలువడుతున్నాయి. పీఎం కిసాన్ సాయం రూ.8 వేలకు పెంచినట్లయితే రైతులకు 18వ విడత కింద రూ.4 వేలు ఇవ్వాల్సి వస్తుంది.

ఎందుకంటే ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి రెండు విడతల్లో రూ.4 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ. 2 వేలతో పాటు పెంచిన 2 వేల రూపాయలు కలిపి.. 18 విడత కింద నాలుగు వేల రూపాయలు జమ చేయాల్సి వస్తుంది. 18వ విడత నిధుల విడుదల ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో ఉంటుంది. మరి రానున్న బడ్జెట్‌లో నిర్మలమ్మ రైతులపై ఎలాంటి వరాలు కురిపిస్తారో చూడాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş