Arjun Suravaram
Arjun Suravaram
నిత్యం పెద్ద పెద్ద పట్టణాల్లోని ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఈ ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలే కాక పశువులు కూడా ఒక కారణం. పశువులను రోడ్లపైకి వదిలేయడం కారణంగా.. విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. ఈ క్రమంలో వాహనాలు ఢీకొనడం, మనుషులపై దాడి చేసి..గాయపర్చడం చేస్తుంటాయి. ఇక ఇలా పశువులను రోడ్లపైకి రాకుండా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. ఈ క్రమంలోనే పశువుల యజమానులకు ప్రభుత్వాలు కీలక సూచనలు చేస్తుంటాయి. అలానే నిబంధనలు అతిక్రమిస్తే జరిమాన విధిస్తున్నారు. తాజాగా ఆ జరిమానాను పెంచుతూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శుక్రవారం గ్రేటర్ చెన్నై కార్పొరే,న్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెన్నై పట్టణంకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. అంతేకాక వివిధ కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడం వంటి నిర్ణయాలు జరిగాయి. వీటితో పాటు పశువులకు సంబంధించిన ఓ విషయంపై కూడా కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల యజమానులకు విధించే జరిమానా మొత్తాన్ని పెంచుతూ జీసీసీ కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రోడ్లపై తిరుగుతున్న పశువులను బంధించి గోశాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి యజమానులకు విధించే జరిమానా పెంచాలని తీర్మానించారు. రూ.2వేలకు పెంచాలని, మూడో రోజుకు నుంచి రోజు కు వెయ్యి రూపాయ చొప్పున అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. మళ్లీ అదే పశువు పట్టుబడితే జరిమానాను రూ.10 వేలుగా పెంచాలని తీర్మానించారు. మరి.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.