iDreamPost
android-app
ios-app

Pavitra Lokesh ప‌విత్ర నా భార్యే… న‌రేశ్ ఎవ‌రో నాకు తెలియ‌దు

  • Published Jul 03, 2022 | 5:07 PM Updated Updated Jul 03, 2022 | 5:07 PM
  • Published Jul 03, 2022 | 5:07 PMUpdated Jul 03, 2022 | 5:07 PM
Pavitra Lokesh ప‌విత్ర నా భార్యే… న‌రేశ్ ఎవ‌రో నాకు తెలియ‌దు

సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేశ్‌, ర‌మ్య‌, ప‌విత్ర లోకేశ్ త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతున్న‌వేళ, రోజుకో ట్విస్ట్, గంట‌కో గొడ‌వ. నాకు విడాకులే ఇవ్వ‌లేదు. మ‌రి మ‌రో మ‌హిళ‌తో హోట‌ల్ లో కాపురం ఎలా పెడ‌తావ‌ని న‌రేశ్ మూడో భార్య ర‌మ్య గొడ‌వ‌చేశారు. అస‌లు బెంగుళూరుకొచ్చి నన్ను బ్యాడ్ చేయొద్ద‌ని ప‌విత్ర లోకేష్ ఇప్ప‌టికే ర‌మ్య‌కు చెప్పారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప‌విత్ర ఇప్ప‌టికీ త‌న భార్యే అని భ‌ర్త సుచింద్రప్రసాద్ అంటున్నారు.

నా భ‌ర్తతో ఎప్పుడో విడిపోయాయ‌ని ప‌విత్ర క్లారిటీ ఇచ్చినా, భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా న‌రేశ్‌, భ‌ర్త‌తో డివోర్స్ తీసుకోకుండా ప‌విత్ర లోకేశ్ …ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌న్న వాద‌న సోష‌ల్ మీడియాలో వినిపిస్తోంది.

లేటెస్ట్ గా, ఇప్ప‌టికీ ప‌విత్ర త‌న భార్య‌న‌ని చెప్పుకొంటున్న సుచింద్ర‌ప్రసాద్, మీడియాతో ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 16 ఏళ్ల క్రిత‌మే మా ఇద్ద‌రికీ పెళ్ల‌య్యింది. త‌న పాస్‌పోర్టులో భార్య‌గా ప‌విత్ర‌, ఆమె పాస్‌పోర్టులో భ‌ర్త‌గా త‌న పేరు ఉంద‌ని, ఇప్ప‌టికీ అదే కంటిన్యూ అవుతోంద‌ని సుచింద్ర‌ప్ర‌సాద్ చెబుతున్నారు.

త‌మ పెళ్లికి ఆధార్‌కార్డును ఆధారంగా చూపిస్తున్నారు. మా ఇద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ప‌విత్ర‌పై త‌న‌కు ఇప్ప‌టికీ గౌర‌వం వుంద‌న్న ఆయ‌న‌, న‌రేశ్ వివాదం వెనుక ఎవ‌రో ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు. అస‌లు ఆ న‌రేశ్ ఎవ‌రో తెలియ‌ద‌ని అన్నారు.

త‌న‌తో పెళ్లికాలేద‌ని, స‌హ‌జీవ‌నం చేశామ‌ని, ఆ త‌ర్వాత విడిపోయామ‌ని ప‌విత్ర‌ ఎందుకు చెప్పారో త‌న‌కు అర్థం కాలేద‌ని అన్నారు. అస‌లు తాను చాలా డ్రెడిష‌న‌ల్ అన్న ఆయ‌న, సహజీవనంపై న‌మ్మ‌కంలేద‌ని తేల్చేశారు. తామిద్దరం 16ఏళ్లుగా భార్యాభ‌ర్త‌లుగా జీవిస్తున్న సంగ‌తి సినిమా ఇండ‌స్ట్రీకి తెలుసున‌న్నారు.

ఆయ‌న చెప్పిందంతా బాగానే ఉందికాని, 2018 నుంచి ఇద్ద‌రూ వేర్వేరుగా బ‌తుకుతున్న‌ట్లు వికీపిడియా పేజ్ చెబుతోంది. 2007లో పెళ్లి అయ్యింది. ఇద్ద‌రూ 2018 వ‌ర‌కు కాపురం చేశారు. నాలుగేళ్లుగా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంబంధాలూ లేవు. కాక‌పోతే విడాకులు తీసుకోలేదు అంతే. ఈ లాజిక్ ను ప‌ట్టుకొని ప‌విత్ర నాకింకా భార్యేన‌ని సుచింద్రప్రసాద్ మీడియా ముందు గగ్గోలుపెడుతున్నాయి. నిజానికి, ఇద్ద‌రూ విడిపోయారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss