iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్: 7.. హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్ననయని పావని..!

  • Published Oct 21, 2023 | 3:48 PM Updated Updated Oct 21, 2023 | 3:48 PM

బిగ్ బాస్ సీజన్ 7 ఆరు వారాలు పూర్తై.. ఏడో వారం ఎండ్ కు వచ్చింది. ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వీరంతా కూడా మహిళలే. ఇదిలా ఉంటే వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చినట్లే.. ఇప్పుడు ఓ రీ ఎంట్రీ కూడా ఉండబోతుంది. అయితే ఈ రీ ఎంట్రీ లో ఇంట్లోకి అడుగుపెట్టేది..

బిగ్ బాస్ సీజన్ 7 ఆరు వారాలు పూర్తై.. ఏడో వారం ఎండ్ కు వచ్చింది. ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వీరంతా కూడా మహిళలే. ఇదిలా ఉంటే వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చినట్లే.. ఇప్పుడు ఓ రీ ఎంట్రీ కూడా ఉండబోతుంది. అయితే ఈ రీ ఎంట్రీ లో ఇంట్లోకి అడుగుపెట్టేది..

  • Published Oct 21, 2023 | 3:48 PMUpdated Oct 21, 2023 | 3:48 PM
బిగ్ బాస్: 7.. హౌస్‌లోకి  రీ ఎంట్రీ ఇవ్వబోతున్ననయని పావని..!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఏడవ సీజన్ మొదలై ఆరు వారాలు గడిచిపోయాయి. ఈ సీజన్ గత సీజన్లలా కాదని, ఇది ఉల్టా పల్టా అంటూ హోస్ట్ నాగార్జున ప్రచార సమయంలోనే చెప్పారు. అన్నట్లుగా కాస్తంత ట్విస్టులుగానే కొనసాగుతుంది బీబీ-7. టాస్కులు, గేమ్స్ కూడా కాస్త కొత్తగా డిజైన్ చేశారు. ఇక కంటెస్టులు కూడా ఎవ్వరికి వారు తగ్గడం లేదు. అయితే మొదటగా 14 మంది హౌస్‌లోకి రాగా, వారిలో రతికా రోజ్ తీవ్రమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. దీంతో ఆమె నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత వారం రతిక లేని లోటు వీక్షకులు, బిగ్ బాస్ యాజమాన్యానికి తెలిసినట్లుంది.. వెంటనే ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలంటూ ఐదుగుర్ని బిగ్ బాస్ హౌస్‌లోకి తెచ్చింది.

వీరిలో అర్జున్ అంబటి, పూజామూర్తి, అశ్విని, నయన పావని, భోలే షావలి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆరు ఎలిమినేషన్లు జరగ్గా.. అందరూ లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుండి బయటకు వచ్చారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభశ్రీ, నయని పావని ఎలిమినేట్ అయ్యారు. అదే సమయంలో ఏదో వారంలో కూడా లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అదలా ఉంచితే.. ఈ సారి మరో రీ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా చెప్పారు ఓ ఎపిసోడ్‌లో. అయితే అక్కడే ఓ విషయం చెప్పారు. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వాళ్లే తిరిగి బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

ఈ లెక్క ప్రకారం చూస్తే.. అందరూ రతిక వైపే చూస్తున్నారు. ఎందుకంటే తన నెగిటివీతో ప్రేక్షకులకు దూరం అయ్యింది. దీంతో ఓట్లు తక్కువ వచ్చి ఉంటాయని అంచనా. అలాగే ఐదో వారంలో ఎలిమినేట్ అయిన నయనపావనీ కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వైల్ట్ కార్ట్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన నయని.. వారం కూడా లేకుండానే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఉన్ననీ రోజులు.. మంచి ఫెర్మామెన్స్ ఇచ్చింది. ఎలిమినేషన్ సమయంలో కూడా చాలా స్ట్రాంగ్ రీజన్స్ చెప్పింది. గేమ్స్ కూడా చాలా చక్కగా ఆడింది. మంచి కంటెస్టెంట్ దొరికిందా అనుకునే లోపు.. తక్కువ ఓట్లు వచ్చాయన్న కారణంతో ఎలిమినేట్ కావాల్సి వస్తుంది.

అయితే బయటకు వచ్చిన ఆమె.. వారంలోపే హౌస్‌లో నుండి బయటకు రావడంపై కన్నీటి పర్యంతమైంది. ఇదిలా ఉంటే ఓట్లు తక్కువ వచ్చిన వారే రీ ఎంట్రీ ఇస్తే.. ఆ లెక్కన ఐదు రోజులే ఉన్న నయనీ తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ మేకర్స్ ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. ఇది నిజమైతే.. రీ ఎంట్రీలో ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. మరి ఎవరూ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio