iDreamPost
android-app
ios-app

తినడానికి తిండి కూడా లేని స్థితిలో పావలా శ్యామల!

తినడానికి తిండి కూడా లేని స్థితిలో పావలా శ్యామల!

ప్యావలా శ్యామల.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీనియర్‌ నటిగా ఈమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సుపరిచితమే. దాదాపు 30కి పైగా ఏళ్ల సినీ జీవితంలో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. సినిమాల పరంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె ఆర్థికంగా మాత్రం ఎంతో చితికిపోయి ఉన్నారు. తినడానికి కూడా తిండి లేని ధీన స్థితిలో గడుపుతున్నారు. సాయం చేసే దాతల కోసం ఎదురు చూపు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..

ప్రస్తుతం పావలా శ్యామల పరిస్థితి దారుణంగా ఉంది. వయో భారంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఆమె అల్లాడిపోతున్నారు. ఇండస్ట్రీ నుంచి ఆమెకు ఎటువంటి సహాయసహాకారాలు అందడం లేదు. ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం ఆమెను మరింత తీవ్రంగా వేధిస్తోంది. అవార్డులను అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. ఒక్కోసారి 5 రోజులు  కూడా పస్తులుండాల్సి వస్తోందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మందులు కొనడానికి డబ్బులు లేక.. అనారోగ్యంతో అల్లాడిపోతున్నారు. ఈ గడ్డు పరిస్థితులు ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే.. ఏదో రోజు తను, కూతురు ఆకలితో మంచంలోనే  చనిపోతామని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. సాయం చేసే దాతల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పావలా శ్యామలకు సాయం చేయాలనుకునే వారు.. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Sri krishna Nager , Yusufguda Branch , Hyderabad , Cell : 9849 175713 సంప్ర‌దించ‌వ‌చ్చు.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet giriş