iDreamPost
android-app
ios-app

బతికుండగానే చంపేశాడు.. హైపర్‌ ఆదిపై శ్యామల ఆగ్రహం!

  • Published Oct 28, 2023 | 1:57 PM Updated Updated Oct 28, 2023 | 1:57 PM

ఇలా పెట్టి చెబితే వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడున్న పరిస్థితిలో క్యాబ్‌ బుక్‌ చేసుకుని బబర్థస్త్‌ సెట్‌కు వెళ్లలేను. హైపర్‌ ఆదిని ప్రశ్నించలేను.

ఇలా పెట్టి చెబితే వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడున్న పరిస్థితిలో క్యాబ్‌ బుక్‌ చేసుకుని బబర్థస్త్‌ సెట్‌కు వెళ్లలేను. హైపర్‌ ఆదిని ప్రశ్నించలేను.

  • Published Oct 28, 2023 | 1:57 PMUpdated Oct 28, 2023 | 1:57 PM
బతికుండగానే చంపేశాడు.. హైపర్‌ ఆదిపై శ్యామల ఆగ్రహం!

ప్రముఖ సీనియర్‌ నటి పావల శ్యామల గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో పాటు ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆమె పరిస్థితి మరింత క్షీణించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఆమె, ఆమె కూతురు అల్లాడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఆమె చనిపోయిందంటూ వీడియోలు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఆమె తన ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై స్పందించారు.

తప్పుడు వార్తలపై కూడా మాట్లాడారు. ప్రముఖ కమెడియన్‌ హైపర్‌ ఆదిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికుండగానే ఆది తనను చంపేశాడంటూ మండిపడ్డారు.తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను చచ్చిపోయాను అంటమే కాదు.. శ్యామల ఆత్మహత్య చేసుకుంది. ఇక లేరు అని ఎవరో వాయిస్‌ కూడా ఇచ్చారట. జబర్థస్త్‌లో ఆది ఉంటాడు కదా.. రష్మీతో చెబుతున్నాడు. నిర్మలమ్మ ఫొటో.. మనోరమ ఫొటోల పక్కన నా ఫొటో పెట్టి.. ఈవిడ ఎవరో తెలుసా? ఈవిడ కూడా ఇప్పుడు లేరు అంత ఇదిగా చెప్పేశాడు. పోయిన వాళ్ల ఫొటోల పక్కన మన ఫొటో కూడా పెడితే.. మనం కూడా పోయామని చెప్పటమే కదా..

ఇలా పెట్టి చెబితే వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడున్న పరిస్థితిలో క్యాబ్‌ బుక్‌ చేసుకుని బబర్థస్త్‌ సెట్‌కు వెళ్లలేను. హైపర్‌ ఆదిని ప్రశ్నించలేను. నీతో ఎవరు మాట్లాడించారు నీ చేత అని కూడా అడగ్గలనా.. అతను దొరుకుతాడా? మనల్ని ఎవరు ఏమన్నా ఎవరితో పోట్లాడతాము’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి, ప్రముఖ కమెడియన్‌ హైపర్‌ ఆదిపై పావలా శ్యామల ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetjojobetcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet