iDreamPost
android-app
ios-app

Parampara 2 పరంపర 2 రిపోర్ట్

  • Published Jul 21, 2022 | 3:08 PM Updated Updated Jul 21, 2022 | 3:08 PM
  • Published Jul 21, 2022 | 3:08 PMUpdated Jul 21, 2022 | 3:08 PM
Parampara 2 పరంపర 2 రిపోర్ట్

మంచి క్యాస్టింగ్, బడ్జెట్ పెట్టే నిర్మాతలు దొరికితే చాలు ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992, ఆర్య, పంచాయత్ లు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యాక ఇప్పుడా ట్రెండ్ మెల్లగా సౌత్ కు పాకుతోంది. ఆల్రెడీ క్రిష్, మారుతీ లాంటి బ్రాండెడ్ దర్శకులు వీటికి కథలు అందించడం సంభాషణలు రాయడం మొదలుపెట్టారు. కొన్ని ఆదరణకు నోచుకున్నాయి. ఆ క్రమంలో కొన్ని నెలల క్రితం వచ్చిందే పరంపర. హాట్ స్టార్ లో ప్యూర్ తెలుగు వెర్షన్ తో వచ్చిన ఈ పొలిటికల్ కం క్రైమ్ థ్రిల్లర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళే రెండో సీజన్ ని రిలీజ్ చేశారు. ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

మొదటి భాగంలో తన తండ్రి(జగపతిబాబు)ని, తనను అణగదొక్కుతున్నాడనే కోపంతో నాగేంద్ర నాయుడు(శరత్ కుమార్)మీద ద్వేషం పెంచుకున్న గోపి(నవీన్ చంద్ర)అతని వల్లే జైలుకు వెళ్తాడు. ఇప్పుడీ సీక్వెల్ సరిగ్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గోపి లోపలి వెళ్ళాక అక్కడ పరిచయమైన రత్నకుమార్(రవివర్మ) సహాయంతో నాయుడు సామ్రాజ్యాన్ని కూల్చాలనే స్కెచ్ వేసుకుంటాడు. కానీ అనూహ్యమైన సవాళ్లు ఎదురవుతాయి. అన్ని వైపులా పద్మవ్యూహం పన్నిన పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని అర్థం చేసుకుంటాడు. మరి నాయుడు ఏం చేశాడు, స్వంత కొడుకుకు గోపికి ఎలాంటి సమస్యలు వచ్చాయనేదే స్టోరీ

బలమైన తారాగణం ఉన్న పరంపర ఇప్పుడు కూడా ఆ అడ్వాంటేజ్ తోనే ఎన్నో బలహీనతలను కవర్ చేసుకుంది. దర్శకులు కృష్ణ విజయ్ – విశ్వనాథ్ లు డ్రామా పండించే ఏ అవకాశాన్ని వదల్లేదు. అయితే మొదలుపెట్టినంత వేగంలో ఉన్న టెంపో క్రమంగా తగ్గిపోవడమే కాక కొన్ని పాత్రలకు సెట్ చేసిన లింకులు సరిగా కుదరకపోవడంతో థ్రిల్ మిస్ అయ్యింది. శరత్ కుమార్, జగపతిబాబు, నవీన్ చంద్ర ఈ ముగ్గురూ మరోసారి డామినేషన్ చేసి గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కథనం మీద ఇంకాస్త బలమైన శ్రద్ధ పెట్టి ఉంటే బెస్ట్ సిరీస్ అయ్యేది కానీ మరీ బ్యాడ్ అనిపించుకుండా ఇలాంటి జానర్ ని ఇష్టపడేవాళ్ళకు టైం పాస్ చేయించడంలో ఫెయిల్ కాలేదు. సినిమా రేంజ్ లో అంచనాలు పెట్టుకోకుండా ఆర్టిస్టుల యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తూ పొతే పరంపర 2 డీసెంట్ వాచ్ గా నిలుస్తుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş