iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ కోటీశ్వరుడు, బంగ్లా, నాలుగు కార్లున్నాయి.. తండ్రి ఏం అన్నారంటే..?

  • Published Sep 22, 2023 | 2:50 PM Updated Updated Sep 22, 2023 | 2:50 PM
  • Published Sep 22, 2023 | 2:50 PMUpdated Sep 22, 2023 | 2:50 PM
పల్లవి ప్రశాంత్ కోటీశ్వరుడు, బంగ్లా, నాలుగు కార్లున్నాయి.. తండ్రి ఏం అన్నారంటే..?

‘అన్నా, నేనొక రైతు బిడ్డని, బిగ్ బాస్‌లోకి వెళ్లాలనుకుంటున్నా’అంటూ ఆవేదనతో కూడిన వీడియోలు చేసిన పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. ఓ రైతు, సామాన్యుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.  తాను సాగు చేస్తున్న వీడియోలు, రైతుల పడే కష్టాలంటూ సోషల్ మీడియాలో  వీడియోలు పెడుతూ ఫేమస్ అయ్యాడు. అయితే చాలా మందికే బిగ్ బాస్ లోకి వచ్చాకే ప్రశాంత్ గురించి తెలుసు. హౌస్ లోకి వస్తూనే నాగార్జునను ఇంప్రెస్ చేస్తూ.. బియ్యం బస్తా బహుమతిగా ఇచ్చి అతడి వైపు దృష్టి మరల్చుకునేలా చేశాడు. హౌస్ లోకి అడుగు పెట్టాక రతిక కారణంగా నెగిటివి మూటకట్టుకున్నాడు. అయినప్పటికీ మిగతా కంటెస్టంట్లకు గట్టి పోటీనిస్తూ , ఓట్లను కొల్లగొడుతున్నాడు.

అయితే హౌస్ మేట్స్ అతడిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బయట కూడా పల్లవి ప్రశాంత్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అతడు కోటీశ్వరుడని, బంగ్లా ఉందని, 25 ఎకరాల భూమి ఉందని, నాలుగు ఖరీదైన కార్లు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. దీనిపై పల్లవి ప్రశాంత్ తండ్రి ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించాడు. అవన్నీ ఉన్నట్లయితే తన కుమారుడికి బిగ్ బాస్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తమకు ట్రాక్టర్ తప్ప మరేమీ లేదని తెలిపారు. ఈ ఆరోపణలు చేసిన వాళ్లు అవన్నీ ఉంటే.. మీరే తీసుకుని, మీ పేరు మీదే రిజిస్టర్ చేసుకోండని అన్నారు. అతడు అసలైన రైతు కాదని చేస్తున్న విమర్శలపై కూడా స్పందించారు.

అతడు చేసినట్లు వ్యవసాయం ఎవ్వరూ చేయలేరన్నాడు. కావాలంటే అతడిలా కష్టం చేయాలంటూ ఛాలెంజ్ చేశారు. తన కొడుకు టాటా,అంబానీ కాదని తెలిపారు. తనకున్నదల్లా ఆరెకరాల పొలం మాత్రమేనని, దాన్ని పంచితే ప్రశాంత్‌కు రెండకరాలు మాత్రమే వస్తాయని అన్నారు. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బులు రైతులకు  ఇస్తానని  చెప్పాడని,  తమకు ఆ డబ్బులు వద్దని అన్నారు. అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలపై తాను బాధపడినట్లు చెప్పారు. రైతులను చిన్న చూపే చూస్తారు కానీ, పెద్ద చూపు చూడరని అన్నారు. ప్రతి ఒక్కరూ రైతులను దోచుకునే వాళ్లేనని అన్నారు. వీటితో పాటు  అనేక విషయాలను పంచుకున్నారు.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique