iDreamPost
android-app
ios-app

OTTలో వెరైటీ మూవీ! పార్టనర్స్ ని వదిలేసి.. విచిత్రమైన లవ్!

  • Published May 11, 2024 | 6:27 PM Updated Updated May 11, 2024 | 6:27 PM

OTT Suggestions- Best Romantic Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ జానర్స్ మూవీస్ ని వదలకుండా చూసేస్తున్నారు. ఈ మూవీ ఒకసారి చూశారంటే ఆ జానర్ ని కూడా వదలరు మీరు.

OTT Suggestions- Best Romantic Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత అన్నీ జానర్స్ మూవీస్ ని వదలకుండా చూసేస్తున్నారు. ఈ మూవీ ఒకసారి చూశారంటే ఆ జానర్ ని కూడా వదలరు మీరు.

  • Published May 11, 2024 | 6:27 PMUpdated May 11, 2024 | 6:27 PM
OTTలో వెరైటీ మూవీ! పార్టనర్స్ ని వదిలేసి.. విచిత్రమైన లవ్!

వీకెండ్ వచ్చేసింది. ఎప్పుడూ యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైనింగ్, డ్రామా, కామెడీ అంటూ చూసిన జానర్సే చూస్తున్నారా? ఒకసారి మీరు చూసే ఓటీటీల్లో రొ*మ్యాన్స్ అనే కేటగిరీ కూడా ఉంటుంది. అందులో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఎప్పుడైనా వాటి వైపు చూశారా? చాలా మందికి ఆ కేటగిరీ సినిమాలు చూడాలని ఉంటుంది. కానీ, స్టోరీ ఎలా ఉంటుందో? కిక్కిచ్చే సీన్స్ ఉంటాయో లేదో అనే కంగారు కూడా ఉంటుంది. అలాంటి అనుమానాలు, భయాలు ఉన్నా వాళ్లు ఈ మూవీని తప్పక చూసేయండి. పైగా ఇందులో మంచి కథ కూడా ఉంది. చాలా కొత్తగా ఉంటుంది. బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ.

ఈ మూవీ థియేటర్లలో ఓ రేంజ్ లో ఆడింది. ఈ సినిమాని కేవలం 25 మిలియన్ డాలర్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా 220 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. డిసెంబర్ 11, 2023న అమెరికాలో ఈ మూవీ విడుదలైంది. అక్కడి అభిమానులు ఈ సినిమా దెబ్బకు పిచ్చెక్కిపోయారు. ఇది ఒక వెరైటీ లవ్ స్టోరీ. కానీ, కాస్త బో*ల్డ్ గా కథను చెప్పుకొచ్చారు. ఇందులో ప్రేమ ఉంటుంది. కేరింగ్ ఉంటుంది. ప్రతీకారం ఉంటుంది. గిల్లి గజ్జాలు ఉంటాయి. మొత్తానికి ఇది ఒక ఫుల్ మీల్స్ స్టోరీ అని చెప్పాలి. కాకపోతే కాస్త అలాంటి సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు ఈ మూవీని ఒంటరిగా చూడాలి.

ఈ సినిమా పేరు ‘ఎనీ వన్ బట్ యూ’. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఒకటి కాదు.. ఏకంగా 6 ఓటీటీల్లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో రూ.99కు వ్యూ ఆన్ రెంట్ కి అందుబాటులో ఉంది. యూట్యూబ్, గూగుల్ ప్లే మూవీస్ లో రూ.120కు రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యాపిల్ టీవీలో అయితే రూ.150కి రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా మంచి అప్లాజ్ లభించింది. అందుకే ఓటీటీలు ఈ మూవీని తమ ప్లాట్ ఫామ్స్ లో రెంట్ కింద అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇంక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. హీరో- హీరోయిన్ కు గొడవ రూపంలో పరిచయం ఏర్పడుతుంది. వాళ్లిద్దరు ఒక పెళ్లిలో కలుస్తారు. ఆ పెళ్లిని వీళ్లిద్దరు కలిసి చెడగొట్టినంత పని చేశారు. అయితే వీళ్ల మద్య చిన్న చిన్న గొడవలు, గిల్లి గజ్జాలు జరుగుతూనే ఉంటాయి. నిజానికి హీరోకి ఒక ఎక్స్ ఉంటుంది. అలాగే హీరోయిన్ కూడా తక్కువ తినలేదు.. ఆమెకు కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. వీళ్లు పలు కారణాల వల్ల వారి నుంచి విడిపోతారు. కానీ, వాళ్లు మాత్రం వీళ్ల జీవితాల నుంచి వెళ్లరు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి వీళ్లు ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ ఉంటారు. మరి.. వీళ్ల లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? అసలు వాళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారా? అనేదే కథ. మధ్యలో కాస్త బో*ల్డ్ సీన్స్ వస్తాయి. కాబట్టి ఒంటరిగా చూసే ప్రయత్నం చేస్తే మంచిది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom