iDreamPost
android-app
ios-app

OTTలో F3, ది గ్రే మ్యాన్ సినిమాల సందడి షురూ

  • Published Jul 23, 2022 | 7:49 PM Updated Updated Dec 23, 2023 | 6:23 PM

ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ మల్టీ స్టారర్ కామెడీ ఎంటర్టైనర్ NetFlix, Sony Liv రెండిట్లోనూ ఒకేసారి స్ట్రీమ్ అవుతోంది.

ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ మల్టీ స్టారర్ కామెడీ ఎంటర్టైనర్ NetFlix, Sony Liv రెండిట్లోనూ ఒకేసారి స్ట్రీమ్ అవుతోంది.

  • Published Jul 23, 2022 | 7:49 PMUpdated Dec 23, 2023 | 6:23 PM
OTTలో F3, ది గ్రే మ్యాన్ సినిమాల సందడి షురూ

OTT ప్రేక్షకులకు పండగే! ఏకంగా 13 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాలు, సిరీస్ ఉన్నాయి. F3. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ మల్టీ స్టారర్ కామెడీ ఎంటర్టైనర్ NetFlix, Sony Liv రెండిట్లోనూ ఒకేసారి స్ట్రీమ్ అవుతోంది.

“గ్రే మ్యాన్” కొన్ని థియేటర్లతో పాటు NetFlixలోనూ రిలీజైంది. మన వర్సటైల్ ఆర్టిస్ట్ ధనుష్ టాప్ క్యాస్ట్ లో కనిపించే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు నాలుగు దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను చూడవచ్చు.

దీంతో పాటు “Blown Away” అనే వినూత్నమైన reality show season 3 కూడా Netflixలో రిలీజైంది.

ఇక బిల్లీ పోర్టర్ డైరెక్ట్ చేసిన నెక్స్ట్ జనరేషన్ రొమాంటిక్ కామెడీ “ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్” (Anything’s Possible) అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.

“ఎజెంట్ ఆనంద్ సంతోష్”! షణ్ముఖ్ జశ్వంత్ డెబ్యూ సిరీస్ “ఆహా”లో అలరిస్తోంది. చంటబ్బాయ్, ఏజెంట్ ఆత్రేయ సినిమాలతో inspire అయి తీసిన ఈ సిరీస్ లో షణ్ముఖ్ కామెడీ టైమింగ్ బాగా హైలైట్ అయ్యింద‌న్న‌ది టాక్.


Sony Livలో F3 తో పాటు “డాక్టర్ అరోరా” అనే హిందీ సిరీస్, “మీమ్ బాయ్స్” అనే తమిళ్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యాయి.

MX Player లో “రుహానియత్” అనే హిందీ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.

డిస్నీ హాట్ స్టార్ లో హిందీ సిరీస్ “ఘర్ వాపసీ” ఇన ద సూప్ : ఫ్రెండ్ కాషన్ అనే కొరియన్ సిరీస్ అలరిస్తున్నాయి. ఇక జగపతి బాబు, నవీన్ చంద్ర స్టారర్ పరంపరా సీజన్ 2 హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇంకేంటి? వీటిలో మీకు నచ్చింది ఎంచుకుని హాయిగా చూసేయండి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş