iDreamPost
android-app
ios-app

అదిరిపోయే EV.. 2 గంటలు ఛార్జ్ చేస్తే.. 187 కి.మీ. రేంజ్ తో!

అదిరిపోయే EV.. 2 గంటలు ఛార్జ్ చేస్తే.. 187 కి.మీ. రేంజ్ తో!

ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే ఎక్కువ మోజు చూపిస్తున్నారు. అందుకే కార్లు, బైకులు, స్కూటీలు అన్నీ ఎక్కువగా విద్యుత్ విభాగలో మోడల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్కెట్ లోకి విడుదలైన సూపర్ ఈవీ గురించి చెప్పబోతున్నాం. మీరు కేవలం రూ.30 వేలు చెల్లించి ఈ బైక్ ఇంటికి తీసుకెళ్లచ్చు. మరి ఆ బైక్ ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? స్పెసిఫికేషన్స్ ఏంటి? అనే విషయాలు చూద్దాం.

బెంగళూరుకు చెందిన ఈవీ కంపెనీ ఒబెన్ విడుదల చేసిన మోడల్ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒబెన్ రోర్ బైక్ ని మీరు కేవలం రూ.30 వేలు డౌన్ పేమెంట్ చేసి తీసుకెళ్లచ్చు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ.1.49 లక్షలుగా ఉంది. మిగిలిన మొత్తాన్ని సరసమైన ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. నెలకు రూ.5,500 ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంది. ఈ బైక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. ఈ బైక్ 80 శాతం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. మీరు ఈ బైక్ ని ఒక నిమిషం ఛార్జ్ చేస్తే.. ఒక కిలోమీటరు వెళ్లచ్చు.

ఈ బైక్ లో 12.3 బిహెచ్ పీ పవర్ రిలీజ్ చేయగల సామర్థ్యం కలిగిన  మోటర్ ని అందిస్తున్నారు. ఈ బైక్ లో ఐపీ67 వాటర్, డస్ట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంది. దీనిని మీరు మీ స్మార్ట్ ఫోన్ కి కూడా కనెక్ట్ చేయచ్చు. డ్రైవర్ అలర్ట్, యాంటీ థెఫ్ట్, ఎనీ టైమ్ బైక్ యాక్సెస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఒబెన్ రోర్ డ్యూయర్ డిస్క్ బ్రేక్స్ తో వస్తోంది. ఇది గరిష్టంగా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. జస్ట్ 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet