iDreamPost
android-app
ios-app

Passion Plus: మార్కెట్ లోకి మళ్లీ రాబోతున్న ప్యాషన్ ప్లస్ బైక్.. అతి తక్కువ ధరకే!

Passion Plus: మార్కెట్ లోకి మళ్లీ రాబోతున్న ప్యాషన్ ప్లస్ బైక్.. అతి తక్కువ ధరకే!

ఆటో మొబైల్ రంగంలో.. మరీ ముఖ్యంగా టూ వీలర్ మ్యానుఫాక్చురర్స్ లో హీరో మోటో కార్ప్ కంపెనీ ప్రత్యేక స్థానం ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన మోడల్స్ కు మార్కెట్ లో మంచి గిరాకీ, ఆదరణ ఉంటుంది. అలాంటి మోడల్స్ లో ప్యాషన్ ప్లస్ కూడా ఒకటి అయితే 2001లో స్టార్ట్ చేసిన ఈ మోడల్ ని 2020లో నిలుపదల చేశారు. ఆ తర్వాత ప్యాషన్ ప్లస్ మోడల్ ని తయారు చేయలేదు. ఆ విషయంలో చాలా మంది మధ్యతరగతి వాళ్లు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు టూ వీలర్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి హీరో కంపెనీ ఒక శుభవార్తను తీసుకొచ్చింది.

హీరో ప్యాషన్ ప్లస్ బండిని మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సారి సరికొత్త మోడల్, లుక్స్ తో తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ మోడల్ కు ప్యాషన్ ప్లస్ 2023 మోడల్ గా పిలుస్తున్నారు. 2020కి ముందు వరకు హీరో కంపెనీకి చెందిన టూ వీలర్ అమ్మకాల్లో మోస్ట్ సేల్డ్ మోడల్ గా ప్యాషన్ ప్లస్ బైక్ ఉండటం విశేషం. ఇప్పుడు 2023 మోడల్ వినియోగదారులను మరింతగా ఆకర్షిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధర విషయంలో కూడా కస్టమర్స్ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్యాషన్ ప్లస్ 2023 మోడల్ ని కేవలం రూ.76,300(ఎక్స్ షరూమ్)కే అందిస్తామని చెబుతున్నారు.

ఈ బైక్ మొత్తం 3 రంగుల్లో అందుబాటులోకి రానుంది. బ్లాక్ నెక్సస్, స్పోర్ట్ రెడ్, బ్లాక్ హెవీ గ్రే రంగుల్లో ఉంటుంది. ఈ ప్యాషన్ ప్లస్ బైక్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 4 స్పీడ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ త వస్తోంది. ఇది 7.8 పీహెచ్, 8.05 ఎన్ ఎం టార్క్ సామర్థ్యంతో వస్తోంది. ఇందులో హీరో కంపెనీకి చెందిన i3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో వస్తోంది. ఈ బైక్ గరిష్టంగా లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ బైక్ కి మార్కెట్  గతంతో పోలిస్తే మరింత క్రేజ్, డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis