కొత్త సంవత్సరంలో మద్యం మానేద్దాం అనుకుంటున్నారా? ఇలా చేయండి

New Year Resolution:కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మంది న్యూ ఇయర్ రిసల్యూషన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆల్కహాల్ కు అలవాటు పడిన వారు ఈ హ్యాబిట్ ను వదిలేయాలి అనుకుంటారు. కానీ, వదలలేరు.. అలాంటి వారు ఇలాంటివి పాటిస్తే ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయంపై నిగ్రహంగా ఉండగలుగుతారు.

New Year Resolution:కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మంది న్యూ ఇయర్ రిసల్యూషన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆల్కహాల్ కు అలవాటు పడిన వారు ఈ హ్యాబిట్ ను వదిలేయాలి అనుకుంటారు. కానీ, వదలలేరు.. అలాంటి వారు ఇలాంటివి పాటిస్తే ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయంపై నిగ్రహంగా ఉండగలుగుతారు.

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం..ఇది కేవలం ఒక ట్యాగ్ లైన్ గా మిగిలిపోయింది అంతే. హానికరం అని తెలిసినా చాలా మంది ఈ వ్యసనానికి బానిస అయిపోతుంటారు. ప్రస్తుతం అయితే, ఇదొక ఫ్యాషన్ లా అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీలు, పురుషులు అందరూ మద్యాన్ని సేవిస్తున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ వ్యసనాలకు త్వరగా అట్ట్రాక్ట్ అవుతుంటారు. అది వయస్సు ప్రభావం వలనో.. చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వలనో ఇటువంటి తప్పు ద్రోవను అనుసరిస్తూ ఉంటారు. అయితే, వీరిలో కూడా చాలా మంది ఈ వ్యసనాలకు దూరంగా ఉండడం కోసం.. తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కొన్నిసార్లు ఉపయోగం లేకుండా పోతుంది. అటువంటి వారు నిగ్రహంగా ఉండాలంటే.. ఏం చేయాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

న్యూ ఇయర్ రిసల్యూషన్స్ ని చాలా మంది అనుసరించాలి అనుకుంటారు. ముఖ్యంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారంతా.. ఫస్ట్ తీసుకునే రిసల్యూషన్ ఇదే.. మద్యం సేవించడం మానేయాలి అని. అనుకున్నట్టుగానే కొద్దిరోజులు దీనిని తూచా తప్పకుండా పాటిస్తారు కూడా. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. మెల్ల మెల్లగా వారి ద్యాస మద్యం వైపు మళ్ళుతూ ఉంటుంది. కొంచెం తాగితే ఏం కాదులే అనుకుని స్టార్ట్ చేస్తారు. అది కాస్త క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీనితో వారు తీసుకున్న నిర్ణయాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. పైగా, కొంతమందికైతే మద్యాన్ని సేవించకపోతే ఎదో వారి ప్రాణమే పోతున్నట్లుగా భావిస్తారు. మరి, ఇలాంటి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంకోసం.. తాము తీసుకున్న నిర్ణయాలపై నిలబడి ఉండాలంటే.. ఈ కొత్త సంవత్సరంలో ఇవి పాటిస్తే సరిపోతుందని కొంతమంది సైకాలజిస్ట్ లు దీని పైన అధ్యయనం చేసి.. కొన్ని సూచనలను అందిస్తున్నారు. అవి ఇలా ఉన్నాయి.

గత సంవత్సరం వారు ఎంత తాగారో లెక్క వేసుకుని.. ఒకేసారి మద్యాన్ని వదిలేయలేని వారు.. ఒక లెక్క ప్రకారం కొంచెం కొంచెంగా మానేసే ప్రయత్నం చేస్తే.. ఫలితం ఉంటుందని, న్యూ మెక్సికో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే, ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్, యోగా , వ్యాయామం ఇలాంటివి సాధన చేయాలి. ఇలా చేయడం వలన మన ఇంద్రియాలు మన ఆదీనంలో ఉంటాయి. కాబట్టి తాగాలనే ఆలోచన నుంచి త్వరగా బయటపడొచ్చు. అంతేకాకుండా, వారు ఉంటున్న పరిసరాలు కూడా దీనికి తగినట్టుగా మార్చుకోవాలి.

వీటితో పాటు.. మద్యాన్ని సేవించడం వలన వచ్చే సమస్యలను, మద్యాన్ని మానేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను తరచూ తెలుసుకుంటూ ఉండాలి. ఒంటరిగా ఉండకుండా మిమ్మల్ని ఈ వ్యసనం నుంచి బయటపడేసే మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. ఇవన్నీ పాటించినా కూడా ఇంకా ఆ అలవాటును మానలేక పోతే వైద్యులను సంప్రదించాలి. అంతే కానీ, మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఉల్లఘించకూడదు. దృఢ నిశ్చయంతో మిమ్మల్ని మీరు నమ్మితే, ఎలాంటి వ్యసనాల నుంచైనా తేలికగా బయటపడొచ్చు. ఏదేమైనా మీరు తీసుకున్న నిర్ణయంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments