iDreamPost
android-app
ios-app

జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి మిశ్రాపై హీరో భార్య దాడి, అక్ర‌మసంబంధం ఆరోపణలపై హీరోయిన్ ఏమ‌న్నారంటే!

  • Published Jul 24, 2022 | 3:13 PM Updated Updated Jul 24, 2022 | 3:13 PM
  • Published Jul 24, 2022 | 3:13 PMUpdated Jul 24, 2022 | 3:13 PM
జాతీయ అవార్డు గ్రహీత ప్రకృతి మిశ్రాపై హీరో భార్య దాడి, అక్ర‌మసంబంధం ఆరోపణలపై హీరోయిన్  ఏమ‌న్నారంటే!

భువనేశ్వర్ వీధుల్లో తనపై దాడికి పాల్పడిన వీడియో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ‌డంతో ఒడిశా నటి ప్రకృతి మిశ్రా(PrakrutiMishra) ఆదివారం Instagram లో స్పందించారు. త‌న భర్త‌తో అక్రమ సంబంధం ఉందని భావించిన బాబుషాన్ మొహంతి( BabushaanMohanty) భార్య, ప్రకృతిపై న‌డిరోడ్డుమీద దాడికి దిగింది.

ప్రకృతిని కారులో ప‌ట్టుకొని దాడికి దిగిన‌ప్పుడు, హెల్ప్ చేయ‌మ‌ని ఆమె వేడుకున్నప్పుడు కూడా, చుట్టుపక్కలవారు సెల్ఫీలు దిగారు, వీడియోలు చిత్రీక‌రిస్తున్నారు త‌ప్ప సాయం చేయ‌లేదు. ఒక‌త‌న‌యితే మ‌రీ దారుణం. ప్ర‌కృతిని కొడుతుంటే అత‌ను సెల్ఫీ దిగాడు. చివ‌ర‌కు హీరో భార్య వెంటాడ‌టంతో ప్రకృతి కారు దిగి, రోడ్డుమీద ఆటో పిలిచి, ఎక్కింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌పై జరిగిన దాడి గురించి ప్రకృతి మాట్లాడింది. “ప్రతి కథకు రెండు పార్శ్వాలు ఉంటాయి. దురదృష్టవశాత్తు, మ‌హిళ‌ల‌ను నిందించ‌డానికి ముందు, వాళ్లు ఏం చెబుతున్నారో విన‌డానికి సిద్ధంగాలేని స‌మాజంలో మ‌న‌మున్నాం. నేను యాక్ట‌ర్ బాబూషాన్, ఉత్కల్ అసోసియేషన్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వెళ్తున్నాం. ఆ సమయంలో, బాబూషాన్ భార్య కొంతమంది గూండాలతో కలిసి నాపై శారీరకంగా, మానసికంగా దాడి చేసింది.

“బాబూషాన్ భార్య ప్రవర్తన నాకు న‌చ్చ‌లేదు ” అని ఆమె కామెంట్ చేసింది. జ‌రిగిన‌దానిపై చ‌ట్ట‌ప‌రంగా వెళ్తాన‌న్న సూచ‌న చేసింది హీరోయిన్ ప్ర‌కృతి.


మహిళా సాధికారత గురించిన పోస్ట్‌ను కూడా ఆమె పంచుకున్నారు. నా లక్ష్యమైన మహిళా సాధికారత సాధించడానికి నేను ఇంకా ఎక్కువ చేయవలసి ఉందన్న త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

View this post on Instagram

A post shared by prakrutimishra (@prakrutimishra)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş