iDreamPost
android-app
ios-app

Divorces : సినిమాను మించిపోతున్న డైవోర్స్ కథలు

  • Published Jan 18, 2022 | 5:02 AM Updated Updated Jan 18, 2022 | 5:02 AM
  • Published Jan 18, 2022 | 5:02 AMUpdated Jan 18, 2022 | 5:02 AM
Divorces : సినిమాను మించిపోతున్న డైవోర్స్ కథలు

సినిమాల్లో వివాహ బంధం గురించి హీరో హీరోయిన్లు ఎంత గొప్పగా చెప్పుకున్నా నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి వాళ్ళూ మన లాంటి మామూలు మనుషులేనని అర్థమవుతుంది. భావోద్వేగాలకు ఎవరూ అతీతం కారనే క్లారిటీ వచ్చేస్తుంది. దానికి ఉదాహరణలు మనకు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి ఓటిటి ట్రెండ్ దాకా కొన్ని వందలు ఉన్నాయి. నిన్న సాయంత్రం ధనుష్ హఠాత్తుగా తన విడాకులను ప్రకటించడం సంచలనం రేపుతోంది. కొంత కాలం క్రితం విడిపోయిన నాగ చైతన్య సమంతాల వ్యవహారం ఇంకా కళ్ళముందు పచ్చిగా ఉండగానే ఇప్పుడీ జంట కూడా ఆ లిస్టులోకి చేరిపోవడం రజనీకాంత్, ధనుష్ ఫ్యాన్స్ ని బాధ పెడుతోంది.

సెలబ్రిటీలు అయినంత మాత్రాన కలకలం కలిసి ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఈ చరిత్ర ఇప్పటిది కాదు. మహానటి సావిత్రి గురించి తెలియని ఇప్పటి జెనరేషన్ జెమిని గణేష్ అసలు రూపాన్ని సినిమాలో చూసి తెలుసుకుంది. నాగార్జునకు మంచి జీవిత భాగస్వామిగా పేరు తెచ్చుకున్న అమల కన్నా ముందు ఆయన లైఫ్ లో చైతు తల్లి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, నరేష్, రఘువరన్, సుమంత్ ఇలా చెప్పుకుంటూ పోతే సింగల్ మ్యారేజ్ కు కట్టుబడలేక వేరే పార్టనర్స్ ని ఆహ్వానించిన వాళ్ళ లిస్టు చాంతాడంత ఉంటుంది. ఈ ఫీల్డ్ లోనే కాదు క్రీడలు, రాజకీయాలు, ఇతర వృత్తులు అన్నిటిలోనూ ఇదే తంతు.

క్రమంగా లైఫ్ మెకానికల్ గా మారిపోతున్న తరుణంలో ఈ విడాకుల పర్వం కూడా అలాగే జరిగిపోతోంది. ఒకప్పుడు వీటి గురించి రోజులు నెలలు తరబడి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడా పరిస్థితి లేదు. విడిపోయిన వాళ్లే అఫీషియల్ గా ప్రకటించడం ఆలస్యం వెంటనే తమ కెరీర్లను చక్కబెట్టుకుని పనిలో బిజీ అవుతున్నారు. తమకు తగ్గ వాళ్ళు ఇంకొకరు దొరికారా సరే లేదా సింగిల్ గా ఉండిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా చిన్నదేమీ కాదు. తాజాగా చిరంజీవి చిన్నమ్మాయి శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయే దిశగా నిర్ణయం తీసుకుందనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఫిలిం అప్ డేట్స్ లాగా ఇవి కూడా మాములు విషయాలు అయిపోతాయేమో

Also Read : సెలబ్రిటీ పెళ్లిళ్లు – గాలిలో దీపాలు

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet