iDreamPost
android-app
ios-app

NTR Daughter: విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం

  • Published Aug 01, 2022 | 6:01 PM Updated Updated Aug 01, 2022 | 7:09 PM
  • Published Aug 01, 2022 | 6:01 PMUpdated Aug 01, 2022 | 7:09 PM
NTR Daughter:  విషాదంలో ఎన్టీఆర్ కుటుంబం

నందమూరి ఇంట తీవ్ర విషాదం. నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొంతకాలంగా ఉమా మహేశ్వరికి అనారోగ్యం. ఆమె కుమార్తె దీక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు దీక్షిత చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో నలుగురిమే ఉన్నాం, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉమా మహేశ్వరి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. లంచ్ కి బైట‌కు రాక‌పోవ‌డంతో తలుపు తెర‌వ‌డానికి ప్ర‌య‌త్నించాం. కాని లోపలి నుంచి బోల్టు పెట్టుకుని ఉందని దీక్షిత చెప్పారు.

ఉమామహేశ్వరి కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు, మానసిక ఒత్తిడికి గురైయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసుల‌కు సమాచారం వచ్చింది. 15 నిమ‌షాల్లోనే అక్క‌డ‌కు వెళ్లిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోగా ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఉమా మహేశ్వరి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ నాలుగో కూతురు. ఇటీవలే ఆమె కూతురి వివాహం ఘనంగా జరిగింది. అప్పుడు కుటుంబం మొత్తం హాజ‌రైయ్యారు.

ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కేసును నమోదుచేసిన పోలీసులు, ఉమా మహేశ్వరిది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. మెడపై కూడా గాయాలున్నాయి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş