iDreamPost
android-app
ios-app

సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తుల వివరాలు ఇలా..

  • Published Jun 23, 2022 | 3:05 PM Updated Updated Jun 23, 2022 | 3:05 PM
  • Published Jun 23, 2022 | 3:05 PMUpdated Jun 23, 2022 | 3:05 PM
సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తుల వివరాలు ఇలా..

సింగరేణిలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 10 లోపు ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జులై 10 వరకూ ఆన్ లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారిని అర్హులుగా పేర్కొంది. డిగ్రీలో కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి.. లేదా డిగ్రీతో పాటు కంప్యూటర్స్ లో ఆరునెలల సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా చేసి ఉండాలి.

వయో పరిమితి విషయానికొస్తే.. అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులను మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది సింగరేణి సంస్థ. కాగా.. అభ్యర్థులను వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ.29,460 వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, సింగరేణి ఉద్యోగుల పిల్లలు రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సింగరేణి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. https://scclmines.com/ ను విజిట్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ ఓపెన్ చేయండి. https://scclmines.com/scclnew/careers_Notification.asp

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş