iDreamPost
android-app
ios-app

పెళ్ళైనా స్పీడు తగ్గని సమంతా

  • Published Feb 10, 2020 | 5:57 AM Updated Updated Feb 10, 2020 | 5:57 AM
  • Published Feb 10, 2020 | 5:57 AMUpdated Feb 10, 2020 | 5:57 AM
పెళ్ళైనా స్పీడు తగ్గని సమంతా

సాధారణంగా ఏ బాషా పరిశ్రమలోనైనా హీరోయిన్ కు పెళ్ళైతే చాలు ఆటోమేటిక్ గా అవకాశాలు తగ్గిపోతాయి. ప్రేక్షకులు సైతం వాళ్ళను చూసే కోణాన్ని మార్చుకుంటారు. చరిత్రలో ఇది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. బోల్డ్ గా వ్యవహారాలు నడిచే బాలీవుడ్ సైతం దీనికి మినహాయింపు కాదు. పెళ్లి కాని భామలను చూసేందుకే ప్రేక్షకుడు ఎక్కువ ఇష్టపడతాడు. కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా నడుస్తూ కొత్త మార్గాన్ని చూపిస్తోంది సమంతా.

కెరీర్ కి పెళ్లికి సంబంధం లేదని టాలెంట్ ఉంటే సరైన కథల ఎంపికతో ఇన్నింగ్స్ ని కొనసాగించవచ్చని రుజువు చేస్తోంది. నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని కుటుంబంలోకి అడుగు పెట్టాక సామ్ ఇక సినిమాలు తగ్గించేస్తుందనే అనుకున్నారందరూ. కానీ దానికి భిన్నంగా సమంతా దూసుకుపోతుండటం గమనార్హం. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్, మహానటి లాంటి మెమరబుల్ మూవీ, అభిమన్యుడు లాంటి యాక్షన్ బ్లాక్ బస్టర్, ఓ బేబీ లాంటి సోలో పెర్ఫార్మన్స్, మజిలీ లాంటి సెన్సిబుల్ హిట్ ఇవన్నీ వచ్చింది మ్యారేజ్ అయ్యాకే.

దేనికవే విలక్షణ పాత్రలు తప్ప ఇందులో ఏ ఒక్కటి గ్లామర్ కోసమో లేదా హీరో పక్కన డాన్సులు చేయడం కోసమో అన్నట్టుగా ఉండవు. ఇటీవలే వచ్చిన జాను కూడా సమంతా పరంగా ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇవి కాక అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తూ ఇంకో కొత్త ఛాలెంజ్ తీసుకుంది. పెళ్ళైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని ఫీలయ్యే హీరోయిన్లకు సమంతా మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఇంకో కొత్త సినిమా ఏది సైన్ చేయని సామ్ కోసం అయిదారు ఆఫర్లు [పెండింగ్ లో ఉన్నాయట.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom