iDreamPost
android-app
ios-app

సమంత స్థానంలో రష్మిక.. చైతన్య తప్పు చేస్తున్నాడా?

  • Published Dec 30, 2022 | 7:20 PM Updated Updated Dec 30, 2022 | 7:20 PM
  • Published Dec 30, 2022 | 7:20 PMUpdated Dec 30, 2022 | 7:20 PM
సమంత స్థానంలో రష్మిక.. చైతన్య తప్పు చేస్తున్నాడా?

కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టినట్టుగా ఉంటాయి. ఆ పాత్రలలో వారిని తప్ప ఎవరినీ ఊహించుకోలేం. ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో సమంత పోషించిన జెస్సీ పాత్ర కూడా అలాంటిదే. అది సమంత మొదటి చిత్రం అయినప్పటికీ.. ఆ పాత్రతో ఆమె ప్రేక్షకులను మాయ చేసేసింది. ఎందరో కుర్రకారు ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇక జెస్సీ పాత్రకు చిన్మయ డబ్బింగ్ చెప్పడం కూడా చాలా ప్లస్ అయింది. జెస్సీ అనగానే చిన్మయ స్వరంతో.. చీరకట్టులో సమంతనే కళ్ళముందు కదలాడుతుంది. అంతలా ప్రేక్షకుల హృదయాలపై ముద్ర వేసిన జెస్సీ పాత్రలో సమంతకి బదులుగా మరొకరిని ఊహించుకోగలమా?.

సమంత లేకుండా ‘ఏ మాయ చేసావే’ సీక్వెల్ తెరకెక్కనుందంటూ వార్తలొస్తున్నాయి. నాగ చైతన్య, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘ఏ మాయ చేసావే’. చైతన్యకు అది రెండో సినిమా అయితే, సమంతకి మొదటిది. ఆ చిత్రంతో ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసింది. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన వీరు.. ప్రేమలో పడి, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల అనూహ్యంగా విడిపోయారు. దాంతో ఈ జంటను వెండితెరపై కూడా మళ్ళీ కలిపి చూడలేమనే బాధ చాలామందిలో ఉంది. ఇప్పుడు ఆ బాధను రెట్టింపు చేస్తూ ‘ఏ మాయ చేసావే-2’లో సమంత నటించట్లేదనే వార్త వైరల్ గా మారింది.

‘ఏ మాయ చేసావే’ సీక్వెల్ ని తెరకెక్కించే సన్నాహాల్లో గౌతమ్ మీనన్ ఉన్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్ లో చైతన్యనే హీరోగా నటించనుండగా.. హీరోయిన్ గా మాత్రం సమంత స్థానంలో రష్మిక రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే ఇప్పుడు ‘ఏ మాయ చేసావే’ ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తోంది. సమంతకి అప్పుడది మొదటి సినిమా కాబట్టి ఏ అంచల్లేకుండా వచ్చి మ్యాజిక్ చేసింది. కానీ ఇప్పుడు రష్మిక పరిస్థితి వేరు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. పైగా లుక్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లో సమంతతో పోల్చి చూస్తారు కాబట్టి ఆమెని మించేలా మెప్పించాలి. దానికితోడు ప్రేక్షకులు చైతన్య-సమంత జంటను రిసీవ్ చేసుకున్నట్లుగా.. చైతన్య-రష్మిక జోడీని రిసీవ్ చేసుకుంటారనేది అనుమానమే. ఏ మాత్రం తేడా కొట్టినా విమర్శల పాలవ్వక తప్పదు. ఎందుకంటే ఈ చిత్రానికి జెస్సీ పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర ఎంతలా మ్యాజిక్ చేస్తే, సినిమా అంత విజయం సాధిస్తుంది. ఏది ఏమైనా సమంత లేకుండా ‘ఏ మాయ చేసావే’ సీక్వెల్ చేయడం రిస్క్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss