iDreamPost
android-app
ios-app

Kalyan Dhev : ఎంతకీ కదలని మెగాఅల్లుడి రెండో అడుగు

  • Published Dec 18, 2021 | 4:54 AM Updated Updated Dec 18, 2021 | 4:54 AM
  • Published Dec 18, 2021 | 4:54 AMUpdated Dec 18, 2021 | 4:54 AM
Kalyan Dhev : ఎంతకీ కదలని మెగాఅల్లుడి రెండో అడుగు

మూడున్నరేళ్ల క్రితం వచ్చిన విజేతతో డెబ్యూ చేసిన మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొత్త సినిమాలు సూపర్ మచ్చి, కిన్నెరసాని విడుదల గురించి ఎలాంటి క్లారిటీ రాకపోవడం విచిత్రమే. అంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుని కూడా ఇంత ఆలస్యమెందుకు అవుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు లేరు. పోనీ ఆగిపోయాయా అంటే అదీ లేదు. శుభ్రంగా షూటింగులను ఎప్పుడో పూర్తి చేసుకున్నాయి. మరి ఎందుకు ఆగుతున్నారో అంతు చిక్కని భేతాళ ప్రశ్న. లాక్ డౌన్ టైంలో ఉన్నప్పుడు ఓటిటి ఆఫర్లు వచ్చినట్టుగా సమాచారం లేదు. రెండు విడతలు వైరస్ అయిపోయింది. మూడోది రావొచ్చంటున్నారు. కానీ వీటికి మాత్రం మోక్షం దక్కడం లేదు.

తొలి చిత్రం విజేతలో మంచి ఎమోషనల్ డ్రామా ఉన్నప్పటికీ ఫైనల్ గా డిజాస్టర్ తప్పలేదు. దాని ప్రభావం కళ్యాణ్ దేవ్ మార్కెట్ మీద పడింది. ఎగబడి కొనేంత సీన్ లేదని బయ్యర్లు సైలెంట్ అయ్యారు. ఇదే కారణమా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఎంత చిరంజీవి అల్లుడు అనే స్టాంప్ ఉన్నా తనకు ఆ కాంపౌండ్ హీరోల నుంచి డైరెక్ట్ సపోర్ట్ పెద్దగా లేదు. సూపర్ మచ్చి, కిన్నెరసానిలను బయటికి తీసుకొచ్చే చొరవా చూపలేదు. వాళ్ళకే ఆసక్తి లేనప్పుడు ఇక మెగా హీరోల అభిమానులు మాత్రం వాటి గురించి ఎందుకు ఆలోచిస్తారు. అందుకే వాటి గురించిన కనీస అప్ డేట్స్ లేక సదరు నిర్మాణ సంస్థలు కూడా సైలెంట్ అయ్యాయి.

వీటి సంగతెలా ఉన్నా కళ్యాణ్ దేవ్ సినిమాలు మరో రెండు మూడు సెట్ల మీద ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా బిజినెస్ అవుతుందనే నమ్మకంతో నిర్మాతలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే ఏడాది అటుఇటుగా నాలుగైదు సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇంతకీ ఫస్ట్ మూవీలో నటన పరంగా అంతగా మార్కులు తెచ్చుకోలేకపోయిన కళ్యాణ్ దేవ్ మెరుగయ్యాడో లేదో తెలియాలన్నాసూపర్ మచ్చి, కిన్నెరసానిలలో ఒకటి రావాలి. ఏదేమైనా హీరోకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఒకటే సరిపోదు, బలమైన మద్దతు, విస్తృతమైన ప్రమోషన్ అన్నీ ఉండాలి. లేకపోతే ఇలాంటి జాప్యాలు తప్పవు

Also Read : Ghani : మెగా మూవీ కథ ఒరిజినల్ కాదా ?

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio