iDreamPost
android-app
ios-app

‘జై లవ కుశ’ సీక్వెల్ వచ్చేస్తోంది!

  • Published Jan 07, 2023 | 10:02 PM Updated Updated Jan 07, 2023 | 10:02 PM
‘జై లవ కుశ’ సీక్వెల్ వచ్చేస్తోంది!

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పటికే డైరెక్టర్స్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సీక్వెల్ ఎందుకు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా. ఎన్టీఆర్ ఐతే ఆ సీక్వెల్ చేయట్లేదులే కానీ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ మాత్రం అలాంటి చిత్రంతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకాబోతున్నాడు.

గతేడాది బింబిసార చిత్రంతో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎమిగోస్ అనే చిత్రం చేస్తున్నాడు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడు. అయితే ఆ పాత్రల తీరు, గెటప్పులే ‘జై లవ కుశ’ చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయి.

‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ కూడా మూడు పాత్రల్లో కనిపించాడు. లవ అమాయకుడు, అతిమంచితనం కలవాడు కాగా.. కుశ కొంటె పనులు చేస్తూ కాస్త మోడ్రన్ గా ఉంటాడు. జై అయితే నెగటివ్ షేడ్స్ తో విలన్ లా కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఎమిగోస్ లో కళ్యాణ్ రామ్ పోషిస్తున్న పాత్రలు కూడా ఇంచు మించు అలాగే ఉన్నాయి. ఎమిగోస్ లో కళ్యాణ్ రామ్ పోషిస్తున్న మూడు పాత్రలకు సంబంధించిన లుక్ పోస్టర్లను ఇటీవల విడుదల చేశారు. సిద్ధార్థ్ అనే పాత్రలో మోడ్రన్ గా, మంజునాథ్ గా అనే పాత్రలో అమాయకంగా కనిపించిన కళ్యాణ్ రామ్.. మూడో పాత్రలో మాత్రం నెగటివ్ షేడ్స్ తో కనిపిస్తున్నాడు.

అయితే ‘ఎమిగోస్’ లో కళ్యాణ్ రామ్ పోషిస్తున్న మూడు పాత్రలు .. ‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలను పోలి ఉండటంతో ఆ సినిమాకి సీక్వెల్ ఏమైనా చేస్తున్నారా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom