iDreamPost
android-app
ios-app

నెల రోజుల క్రితమే పెళ్లి.. లాటరీలో కేజీ బంగారం!

నెల రోజుల క్రితమే పెళ్లి.. లాటరీలో కేజీ బంగారం!

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేము. అప్పటి వరకు కటిక పేదరికంలో ఉన్న వారు అదృష్టం తగిలితే కోటీశ్వర్లు అవుతారు. అలానే లాటరీ కొని.. లక్షలు, కోట్లు గెల్చుకున్నా వారు ఎందరో ఉన్నారు. ఇలా కొందరు డబ్బులు గెల్చుకోగా, మరికొందరు బంగారం గెల్చుకుంటారు. అయితే ఓ నవ దంపతులకు మాత్రం భారీ అదృష్టం వరిచింది. షాపులో బంగారం కొన్న ఆ దంపతులు లాటరీ తీయగా, కేజీ బంగారం గెల్చుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రం బళ్లారి తాలూకాలోని కప్పగల్‌ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తన కుమార్తె రుచితను అల్లీపురానికి చెందిన నాగార్జునతో పెళ్లి జరిపించారు.  అయితే పెళ్లి సమయంలో ఓ షాపులో నగలు కొనుగోలు చేశారు. అప్పటికే కర్ణాటక రాష్ట్ర జ్యువెలరీ ఫెడరేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 10 నుంచి గోల్డ్ షాపుల్లో రూ.5 వేలకు పైగా బంగారం కొనుగోలు చేసిన వారికి లాటరీ కూపన్లు అందించారు. నాగరాజుకు కూడా సదరు షాపులో కూపన్‌ ఇచ్చారు. ఇలా రాష్ట్రం మొత్తం మీద 12 లక్షలకు పైగా కూపన్లు అందుకున్నారు.

ఇటీవలే లక్కీ డిప్‌ తీయగా, నాగరాజుకు ఒక కిలో బంగారం తగిలిందని సదరు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ప్రస్తుతం  ఉన్న బంగారం ధరల ప్రకారం చూస్తే.. దాదాపు రూ.55 లక్షల విలువ చేస్తుంది. ఆదివారం నాగరాజు అల్లుడు, కూతురైన నాగార్జున, రుచితలకు ఒక కేజీ బంగారాన్ని అందచేశారు. ఇందులో జ్యువెలరీ ఫెడరేషన్‌ ప్రముఖులు పాల్గొని జంటను అభినందించారు. ఇలా పెళ్లైన నెల రోజులకే వారికి అదృష్ట లక్ష్మి వరించింది. నూతన దంపతులను అందరు అభినందిస్తున్నారు. మరి.. ఈ అదృష్ట దంపతులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş