Special Shows : పాత సినిమాల ప్రీమియర్లు – అభిమానుల సంబరాలు

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు కూడా మంచి రన్ సాధించి భారీ వసూళ్లు ఇచ్చేవి. ఏఎన్ఆర్ దేవదాస్, దానవీర శూరకర్ణ, అడవిరాముడు, ఘరానా మొగుడు లాంటివి పదే పదే వచ్చినా జనం థియేటర్లలోనే చూసేవాళ్ళు. అప్పుడు ఓటిటిలు యుట్యూబ్ లు లేవు కాబట్టి హాలుకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. లేదా కేబుల్ ఛానల్ లో వేసినప్పుడు మాత్రమే చూడాలి. క్రమంగా శాటిలైట్ ఛానల్స్ రావడంతో మొదలుపెట్టి ప్రైమ్ లాంటి యాప్స్ వచ్చేదాకా ఈ క్రమంలో జరిగిన ఎన్నో పరిణామాలు రీ రిలీజ్ అనే మాటే లేకుండా చేశాయి. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరోల అభిమానులు ఆ ట్రెండ్ ని భారీ ఎత్తున తీసుకొస్తున్నారు.

ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో పలు సెంటర్స్ లో మహేష్ బాబు బిజినెస్ మెన్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ షోలు ప్రదర్శించారు. థియేటర్ల దగ్గర హంగామా చూస్తే ఇది పునఃవిడుదల తేదీనా లేక టైం మెషీన్ లో వెనక్కు వెళ్ళామా అని అనుమానం వచ్చే రేంజ్ లో హల్చల్ చేశారు. దాని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దూకుడుకు ఇదే తరహా స్క్రీనింగ్ తో ఆర్టిసి క్రాస్ రోడ్స్ చేసిన అల్లరి ఇంకా గుర్తే. ఇవే కాదు గతంలో మగధీర, చెన్నకేశవరెడ్డి, ఆది, అరవిందసమేత వీర రాఘవ, రంగస్థలం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లకు ఇలా ప్రత్యేక ప్రీమియర్లు వేసి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా హీరోల ఫ్యాన్స్

స్టార్ హీరోలు ఒక్కో సినిమాలు రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం వల్లే యానివర్సరీల పేరుతో ఇలాంటి సంబరాలకు ఫ్యాన్స్ తెర తీస్తున్నారు. ఏడాదికి రెండు మూడు వస్తే ఈ అవసరం పడదు. కానీ అలా జరగడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద చూసి మూడేళ్లు దాటింది. మహేష్ బాబు రెండున్నర సంవత్సరాలు, చరణ్ ప్రభాస్ లు రెండేసేళ్లు ఇలా ఇంతేసి స్పేస్ ఉంటే థియేటర్ దగ్గర జరిగే జాతర వాతావరణం కోరుకునే అభిమానులు ఇంతకన్నా ఏం చేయగలరు. అందుకే ఈ ట్రెండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ఇలాగే కంటిన్యూ అయితే పెదరాయుడు, చంటి, గ్యాంగ్ లీడర్ లాంటి 90లనాటి సినిమాలు కూడా స్క్రీన్ మీద చూడొచ్చేమో

Also Read : Salman Khan : కండల వీరుడి కోసం గాడ్ ఫాదర్ ఎదురుచూపు

Show comments