iDreamPost
android-app
ios-app

పాక్ మహిళ పబ్జీ ప్రేమ కథలో మరో అదిరిపోయే ట్విస్ట్..!

పాక్ మహిళ పబ్జీ ప్రేమ కథలో మరో అదిరిపోయే ట్విస్ట్..!

పాక్ మహిళ పబ్జీ ప్రేమ కథలో  రోజూకో ట్విస్ట్  బయట పడుతుంది. పబ్జీ గేమ్ ఆడుతూ భారతీయుడిలో లవ్ లో పడిన పాక్ మహిళ.. తన నలుగురి బిడ్డలతో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పబ్జీ ప్రేమ కథా చిత్రమ్ దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించింది. ఈ పబ్జీ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకుని యూపీ ఏటీఎస్ అధికారులు విచారించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. నకిలీ పేర్లతో హోటల్ రూమ్ తీసుకుని వారం రోజులు బస చేసినట్లు తెలిసింది.

పబ్జీ గేమ్ ఆడుకుంటూ పరిచయమై..యూపీ యువకుడు సచిన్‌ మీనా, పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ ప్రేమించుకున్నారు. ఇక ఆమె తన కుటుంబాన్ని వదిలేసి..నలుగురు పిల్లలతో కలిసి షార్జా, నేపాల్ ల మీదుగా భారత్ లోకి ప్రవేశించింది. అయితే ఇక్కడికి రాకముందు సచిన్ మీనా, సీమా హైదర్ మొట్టమొదటిసారిగా నేపాల్‌లో కలిసినట్లు తెలుస్తోంది. భారత్‌లోకి ప్రవేశించడానికి ముందు వారం రోజుల పాటు ఖట్మండులోని ఓ హోటల్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.. ఈ విషయాన్ని ఆ ఖాట్మండులోని హోటల్‌ ఓనర్ కూడా స్పష్టం చేశాడు.

ఇప్పటికే సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంట్ అని అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో నకిలీ పేర్లతో రూమ్ తీసుకోవడంతో పోలీసులకు అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేపాల్ లోని హోటల్ ఒనర్ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం…  వారి హోటల్ కి వెళ్లిన వారిద్దరు.. అక్కడే వారం రోజుల పాటు బస చేసినట్లు పేర్కొన్నాడు.  ఈవారం రోజులు కేవలం సాయంత్రం సమయంలోనే వారిద్దరు బయటకు వచ్చేవారని తెలిపాడు. తొలుత హోటల్‌కు వచ్చిన సచిన్.. తన పేరు శివాన్ష్ అనే పేరుతో రూమ్ ను బుక్ చేసుకున్నాడని తెలిపాడు. అతడు వచ్చిన తరువాత రోజు సీమా ఒంటరిగానే వచ్చినట్లు గణేశ్ తెలిపాడు.

వారు హోటల్‌ రూమ్‌ను ఖాళీ చేయడానికి ఒకరోజు ముందు సీమా వెళ్లిపోయిందని,  మరుసటి రోజు సచిన్‌ వెళ్లాడని అతడు చెప్పాడు. హోటల్‌ అద్దెను సచిన్ భారతీయ కరెన్సీలో చెల్లించినట్లు హోటల్ ఓనర్ గణేశ్‌ వెల్లడించాడు. అతడు చెప్పిన విషయాలతో పోలీసులకు మరింత అనుమానం పెరిగింది. నలుగురు పిల్లలతో ప్రత్యక్షమైన సీమా హైదర్.. హోటల్ కి వచ్చిన సమయంలో పిల్లల్ని ఎక్కడ ఉంచిందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత విచారణ చేస్తున్నారు. చూడలి మరి.. ఈ పబ్జీ ప్రేమ కథలో మరెన్ని ట్విస్ట్ లు వెలుగులోకి వస్తాయి. మరి.. ఈ పబ్జీ పాప స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom