iDreamPost
android-app
ios-app

సమంతా దారిలో యంగ్ హీరొయిన్లు

  • Published Jan 06, 2020 | 4:25 PM Updated Updated Jan 06, 2020 | 4:25 PM
సమంతా దారిలో యంగ్ హీరొయిన్లు

ఇప్పుడు సినిమా పరిశ్రమలో అవకాశాలు తగ్గుతున్న హీరొయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కొత్త ప్లాట్ ఫార్మ్ దొరికింది . అదే వెబ్ సిరీస్. ఖర్చు, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా ప్రేక్షకులను కట్టిపడేసే రీతిలో వీటిని రూపొందిస్తుండటంతో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. రెండు నెలల క్రితం అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్ అవ్వడమే కాక దక్షిణాది బాషలలో డబ్బింగ్ రూపంలోనూ ఆదరణ దక్కించుకుంది.

అందుకే దీని సీక్వెల్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ అయినా సరే ఛాలెంజింగ్ గా అనిపించడంతో సమంతా ఓకే చెప్పింది. ప్రస్తుతం దీని చిత్రీకరణలోనే సాం బిజీగా ఉంది. మనోజ్ బాజ్ పాయ్ టైటిల్ రోల్ పోషించిన ఫ్యామిలీ మ్యాన్ లో సమంతా టెర్రరిస్టు పాత్రలో కనిపించనున్నట్టు ఇన్ సైడ్ టాక్. పారితోషికం కూడా భారీగా ముట్టిందని అంటున్నారు

ఇదిలా ఉండగా పట్టుమని పాతిక సినిమాలు చేయకుండానే కెరీర్ ఎండింగ్ లోకి వచ్చిన మరికొందరు హీరొయిన్లు సైతం వెబ్ సిరీస్ లవైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కాల్ షీట్స్ ఎక్కువగా అవసరం అవుతున్నా సరే రెమ్యునరేషన్ ఆకర్షణీయంగా ఉండటంతో కథ బాగుంటే కనక పెద్దగా ఆలోచించడం లేదట. టీవీ సీరియల్స్ కన్నా ఇవి నయమనే అభిప్రాయం ఎక్కువ కావడంతో ఇటు వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మాజీ హీరొయిన్లు సైతం ఇదీ దారిలో వెళ్తున్నారు. ఒకవేళ ఫ్యామిలీ మ్యాన్ తరహలో మరో రెండు మూడు సిరీస్ లు కనక సూపర్ హిట్ అయితే ఇదో కల్పతరువుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom