iDreamPost
android-app
ios-app

నెలకు రూ.25 లక్షలిస్తా.. జీతం తీసుకొనే భార్య‌గా ఉండ‌మ‌ని ఓ వ్యాపార‌వేత్త‌ ఆఫర్, Neetu Chandra బైట‌పెట్టిన నిజాలివి

  • Published Jul 14, 2022 | 2:55 PM Updated Updated Jul 14, 2022 | 2:55 PM
  • Published Jul 14, 2022 | 2:55 PMUpdated Jul 14, 2022 | 2:55 PM
నెలకు రూ.25 లక్షలిస్తా.. జీతం తీసుకొనే భార్య‌గా ఉండ‌మ‌ని ఓ వ్యాపార‌వేత్త‌ ఆఫర్, Neetu Chandra బైట‌పెట్టిన నిజాలివి

మంచి సినిమాల్లో న‌టించా. అందులో చాలా అవార్డు విన్నింగ్స్ మూవీస్. అయినా ఇప్పుడు ఆఫ‌ర్లు లేవు. బాలీవుడ్‌లో అవ‌కాశాల కోసం వెతుకుతున్న‌ప్పుడు, ఒక బిజినెస్ మేన్ ఆఫ‌ర్ ఇచ్చాడు. అది సినిమాలో పాత్ర‌కాదు. అత‌ని ప‌క్క‌న భార్యగా నటించడానికి. నెల‌కు రూ. 25 లక్షలు ఇస్తానన్నాడ‌ని నీతూ చంద్ర క‌న్నీరు పెట్టుకుంది.

ఇది షాకింగ్! బాలీవుడ్ నటుల‌కు పాత్ర‌లు దొరుకుతూనే ఉంటాయి. అలాగ‌ని అంద‌రికీ కాదు. టాలెంటెడ్ నటి నీతూ చంద్ర(Neetu Chandra) చెప్పిన విష‌యం నిజంగా షాకింగ్, బాధ‌పెట్టేదే. అంద‌రూ మంచి న‌టిన‌ని అంటారు. కాని ఎవ‌రూ కేర‌క్ట‌ర్ల‌ను ఆఫర్ చేడంలేదు. చాలా ఏళ్ల నుంచి సినిమాల్లో ప‌నిలేద‌ని నీతూ చెప్పింది. ఈ స‌మ‌యంలోనే, భార్యగా త‌న‌ప‌క్క‌న ఉండ‌టానికి నెలకు 25 లక్షల రూపాయలు ఇస్తాన‌ని ఓ బిజినెస్ మేన్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని అంటోంది నీతూ చంద్ర‌. నా కథ సక్సెస్ ఫుల్ యాక్టర్, ఫెయిల్యూర్ స్టోరీ. 13 జాతీయ అవార్డు సినిమాల్లో పనిచేశా, కాని ఇప్పుడు పని లేద‌ని బాధ‌ప‌డింది. నా దగ్గర డబ్బు లేదు. సినిమాల్లో పనీ లేదు. నేను చాలా ఫీల్ అయ్యా. బాలీవుడ్ కి నేను అక్క‌ర్లేద‌ని అనిపిస్తోందని ఓ ఇంట‌ర్వ్యూ చెప్పి బాధ‌ప‌డింది.


 

దీనికితోడు ఒక ఆడిష‌న్ లో రిజ‌క్ట్ కావ‌డంతో ఆమె కాన్ఫిడెన్స్ బాగా దెబ్బ‌తింది. ఒక‌పేరున్న‌ కాస్టింగ్ డైరెక్టర్ ఆడిష‌న్ చేశాడు. గంట త‌ర్వాత వ‌ర్క్అవుట్ కావ‌డంలేద‌ని చెప్పాడు. ఇదికూడా మామూలు పాత్రే. అయినా నేను ఆ క్యారెక్ట‌ర్ కి సూట్ కాన‌ని రిజ‌క్ట్ చేశాడ‌ని నీతూ చెప్పింది.

అక్షయ్ కుమార్ సరసన నీతూ చంద్ర గరమ్ మసాలా సినిమాతో అరంగేట్రం చేసింది, తర్వాత ఆమె ఓయే లక్కీ ఓయే(Oye Lucky Oye) వంటి చిత్రాలలో జాతీయ అవార్డు గెలుచుకుంది. ట్రాఫిక్ సిగ్నల్(Traffic Signal), ఆర్ మాధవన్‌తో 13 బి(13 B ) , మరిన్ని చిత్రాలలో పనిచేసింది. తెలుగులో గోదావ‌రి సినిమాలో సుమంత్ ప‌క్క‌న న‌టించింది. ఆ త‌ర్వాత ఆమెకు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఈరోజుకూ ఒక్క పాత్ర కూడా రావ‌డంలేదు. ఎందుకో నీతూకి అర్ధంకావ‌డంలేదు.

 

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom