iDreamPost
android-app
ios-app

ఇలా పెళ్లైందో లేదో.. అప్పుడే వివాదంలో చిక్కుకున్న నయనతార

  • Published Jun 10, 2022 | 6:01 PM Updated Updated Jun 10, 2022 | 6:01 PM
  • Published Jun 10, 2022 | 6:01 PMUpdated Jun 10, 2022 | 6:01 PM
ఇలా పెళ్లైందో లేదో.. అప్పుడే వివాదంలో చిక్కుకున్న నయనతార

ప్రముఖ సినీ నటి నయనతార – తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల వివాహం నిన్న మహాబలిపురంలోని ఓ రిసార్టులో వైభవంగా జరిగింది. నెట్టింట ఎక్కడ చూసినా వీరి పెళ్లిఫొటోలే దర్శనమిస్తున్నాయి. కానీ.. ఈ కొత్తపెళ్లి కూతురు అప్పుడే ఓ వివాదంలో చిక్కుకుంది. పెళ్లయ్యాక నవ దంపతులు శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని బయటికి వచ్చిన ఈ దంపతులను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అప్పుడే ఒక విషయాన్ని గ్రహించారు అభిమానులు.

కొత్తపెళ్లికూతురైన నయనతార తిరుమాడవీధుల్లో చెప్పులేసుకుని నడించింది. విఘ్నేశ్ సహా మిగతా అందరూ చెప్పుల్లేకుండానే నడవగా.. నయన్ మాత్రం చెప్పులేసుకుని నడవడం వివాదాస్పదమయింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. అత్యంత పవిత్రంగా భావించే తిరుమాఢవీధుల్లో సాధారణంగా భక్తులు చెప్పులు ధరించి నడవరు. అలాంటిది కొత్తపెళ్లికూతురైన నయన్ ఇలా చెప్పులు ధరించి కనిపించడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. నయనతార స్వామివారికి క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetfixbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio