ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు!

టాలీవుడ్ సినిమాలు జాతీయ స్థాయి అవార్డుల్లోనే కాదూ.. ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లోనూ సత్తా చాటుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ గ్లోబల్ స్టార్స్‌గా మారిపోతున్నారు. దీంతో మిగిలినా సినిమా పరిశ్రమల్లోని వ్యక్తులు.. తెలుగు సినిమా అంటే ఓ రకమైన అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ నటుడు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్న రెండు తెలుగు సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.  ఇంతకు ఆ రెండు సినిమాలు ఏంటంటే..ఆర్ఆర్ఆర్. పుష్ప-ద రైజ్, ఈ సినిమాలనుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో హీరోల బలప్రదర్శన ఎక్కువని, అందుకే తాను ఆ సినిమాలు చూడలేదని, మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వం చూశానని చెప్పారు.

హైపర్‌మాస్కులినిటీ (బలప్రదర్శన, హీరోయిజం) సంబంధించిన సినిమాలు పురుషుల అభద్రతను పెంచేలా ఉన్నాయని తాను భావిస్తునానన్న నసీరుద్దీన్ షా.. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను ఎంత మంది మహిళలు ఇష్టపడతారని ప్రశ్నించారు. హీరోయిజాన్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నా.. ఆర్ఆర్ఆర్, పుష్ప-ది రైజ్ వంటి చిత్రాలను తాను చూడలేనని అన్నారు. ఇలాంటి చిత్రాలను ఆస్వాదించడం వల్ల ఏం లాభం అని, వాటిని తాను చూడనని చెప్పారు. అమెరికాలోని మార్వెల్‌ యూనివర్స్‌ చిత్రాలు సైతం ఇదే తరహాలోనివేనని, అదే పరిస్థితి భారత్‌లోనూ కనిపిస్తోందన్నారు. మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమా తనకు నచ్చిందని చెప్పారు. ఎందుకంటే అతను ఎటువంటి ఎజెండా లేని దర్శకుడు అని పేర్కొన్నారు. మరీ ఈ వ్యాఖ్యలు ఎంత దూరం వెళతాయో చూడాలి. కాగా, ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు పాట ఆస్కార్ బెస్ట్ సాంగ్ అవార్డును గెలుచుకోగా.. పుష్ప, అలాగే ఆర్ఆర్ఆర్ నేషనల్ అవార్డులను కొల్లగొట్టిన సంగతి విదితమే.

Show comments