iDreamPost
android-app
ios-app

నాలుగేళ్ల వివాహ బంధానికి ‘చైతన్య-సమంత’ల గుడ్ బై

నాలుగేళ్ల వివాహ బంధానికి ‘చైతన్య-సమంత’ల గుడ్ బై

చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో ఏకైక హాట్ టాపిక్ గా నిలిచిన నాగ చైతన్య అక్కినేని సమంతల విడాకుల వార్తల మీద క్లారిటీ వచ్చేసింది.. అక్కినేని నాగచైతన్యతో తాను విడిపోతున్నట్లు హీరోయిన్ సమంత అధికారికంగా ప్రకటించగా సరిగ్గా అదే సమయానికి హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో భార్యాభర్తల బంధానికి గుడ్ బై చెబుతున్నానని అక్కినేని నాగచైతన్య ప్రకటించారు.. నిజానికి చాలా కాలం క్రితం నుంచి వీరిద్దరూ విడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ ప్రచారానికి తగ్గట్లే వీరిద్దరూ కలిసి ఎక్కడా కనపడకపోవడం సోషల్ మీడియాలో సైతం ఒకరి ఫోటోలు ఒక్కరు షేర్ చేసుకోక పోవడంతో ఈ వార్తలు నిజమేనని అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే సాధారణంగా చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి చూపి మీడియా ఈ విషయం మీద హైలెట్ చేయడంతో ఇది నిజం అయి ఉండకపోవచ్చని ఏదైనా ఉంటే వాళ్లే అధికారికంగా ప్రకటిస్తారు కదా అని సగటు ప్రేక్షకులు భావించారు. అయితే ప్రచారం జరిగినట్టుగానే ఇద్దరూ ఒకే రకమైన ప్రకటన విడుదల చేశారు, అది కూడా దాదాపుగా ఒకే సమయంలో. ఇక నేను సమంత భార్యాభర్తలుగా విడి పోతున్నామని ఇప్పుడు మా దారులు వేరయ్యాయని నాగచైతన్య ప్రకటించారు. సమంత కూడా తాను నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించారు. మొత్తంగా మా ఇద్దరి మధ్య పదేళ్ల స్నేహబంధం కొనసాగిందని ఆ బంధం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నానని ఇద్దరూ చెప్పుకొచ్చారు.

అలాగే ఇలాంటి కష్టమైన సమయాలలో మీడియా, స్నేహితులు, శ్రేయోభిలాషులు మాకు అండగా నిలిచి కాస్త ప్రైవసీ కల్పించాలని కోరుతున్నామని ఇద్దరూ కోరారు. నిజానికి వీరిద్దరూ అక్టోబర్ ఏడో తేదీ 2017న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎందుకు కొనసాగ లేదు అనే విషయం మీద వారిద్దరూ తప్ప ఎవరూ సరైన క్లారిటీ ఇవ్వలేరు. సెలబ్రిటీలు అయినా వాళ్లకు కూడా పర్సనల్స్ ఉంటాయి కాబట్టి ఈ విషయం మీద ఇక చర్చలు అనవసరం. వాళ్ళిద్దరూ మేము విడిపోతున్నాం మా పని మేం చూసుకుంటాం, మీ పని మీరు చూసుకోండి అని క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఈ విషయం మీద మీడియా ఫోకస్ తగ్గించే అవకాశం ఉంది.

Also Read : ‘మా’ ట్విస్టులు చూడతరమా.. సీవీఎల్ కూడా బైబై

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom