iDreamPost
android-app
ios-app

కెరీర్ పీక్స్‌లో ఉండగా.. నభా నటేష్ ఎమోషనల్ కామెంట్స్!

  • Published Jul 07, 2024 | 3:53 PM Updated Updated Jul 07, 2024 | 3:53 PM

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అలరించిన బ్యూటీ నభా నటేష్. తాజాగా కాస్త గ్యాప్ తర్వాత డార్లింగ్ మూవీతో వస్తోంది. అయితే ఈ కెరీర్ గ్యాప్ రావడానికి కారణాలు వెల్లడించింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అలరించిన బ్యూటీ నభా నటేష్. తాజాగా కాస్త గ్యాప్ తర్వాత డార్లింగ్ మూవీతో వస్తోంది. అయితే ఈ కెరీర్ గ్యాప్ రావడానికి కారణాలు వెల్లడించింది.

  • Published Jul 07, 2024 | 3:53 PMUpdated Jul 07, 2024 | 3:53 PM
కెరీర్ పీక్స్‌లో ఉండగా.. నభా నటేష్ ఎమోషనల్ కామెంట్స్!

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో చందనపు బొమ్మ నభా నటేష్. నన్ను దోచుకుందువటే.. అదుగో మూవీలో టాలీవుడ్ అభిమానాన్ని దోచుకోలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో ఒక్కసారిగా క్లిక్ అయ్యింది నభా.  ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు.  ఈ మూవీతో విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఈమెకు. వరుస పెట్టి ఆఫర్లు క్యూ కట్టాయి.  అన్నీ బిగ్ స్టార్స్ సరసనే. రవితేజ డిస్కోరాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది.   అయితే సినిమాల్లో చేస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ జరిగి సినిమాలకు దూరం అయ్యింది. భుజానికి గాయం కావడం వల్ల కాస్త రెస్ట్ తీసుకుంది.

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమె డార్లింగ్ మూవీతో వస్తుంది.  ప్రియదర్శి, నభా లీడ్ రోల్స్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతన్న డార్లింగ్ మూవీకి అశ్వినీరామ్ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. హనుమాన్ తర్వాత వీరి నుండి రాబోతున్న చిత్రం ఇది. జూన్ 19న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్ లో నభా మీడియాతో మాట్లాడుతూ.. యాక్సిడెంట్ జరిగినప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.

Naba Natesh

‘రెండు సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్‌ జరిగింది.  ఆ తర్వాత సినిమాలు చేయట్లేదు. కోలుకుని తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నప్పుడు.. ఈ ఆఫర్ వచ్చింది. అయితే యాక్సిడెంట్ తర్వాత నేను ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోయాను. ఆపరేషనైన పది రోజులకే  షూటింగ్‌లో పాల్గొన్నాను. దీంతో నా హెల్త్‌ మళ్లీ ఎఫెక్ట్‌ అయింది. తర్వాత ఇంకో సర్జరీ జరిగింది. నా శరీరానికి కచ్చితంగా రెస్ట్‌ ఇవ్వాలనిపించింది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమని ఫిక్స్‌ అయ్యాను. అందుకే గ్యాప్ తీసుకుని ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. అందుకే గ్యాప్ వచ్చింది.  ఆ తర్వాత ‘డార్లింగ్‌’ మూవీ ఆఫర్ వచ్చింది.

చాలా మంది ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి కమర్షియల్‌ సినిమా తర్వాత ‘డార్లింగ్‌’ లాంటి సినిమా ఎందుకు చేస్తున్నావని అడిగారు.  బట్‌ ఆడియన్స్‌కి తెలుసు..ఇప్పుడు కంటెంట్‌ అనేది న్యూ కమర్షియల్‌ అని. డైరెక్టర్‌ అశ్విన్‌ చెప్పిన క్యారెక్టర్, తనను నన్ను అప్రోచ్ అయిన విధానం చూసి ఈ సినిమాకి ఒప్పుకున్నాను. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు, దర్శికీ గొడవలు ఉన్నాయా అని చాలా మంది అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. అది జస్ట్ మూవీ ప్రమోషన్’ మాత్రమే అని చెప్పింది నభా.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet